చిల్లర కష్టాలు... | Kriti Sanon suffers demonetisation's side effects in Lucknow | Sakshi
Sakshi News home page

చిల్లర కష్టాలు...

Published Sun, Nov 13 2016 10:48 PM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM

చిల్లర కష్టాలు...

చిల్లర కష్టాలు...

అయ్యయ్యో... చేతిలో వంద నోటు లేదులే! అయ్యయ్యో.. కార్డులో క్యాష్ బయటకు రాదులే! అయ్యయ్యో పర్సు ఖాళీ ఆయనే! - ఇప్పుడు ఇండియాలో దాదాపుగా అందరూ ఇదే పాట పాడుకుంటున్నారు. సామాన్యులు మాత్రమే కాదు, సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదు. చిల్లర కష్టాలతో ఇబ్బంది పడుతున్నారు. ‘ప్లీజ్.. వంద నోట్లుంటే ఇవ్వండి’ అని చుట్టుపక్కల వారిని అడుగుతున్నారు. ఇద్దరు హిందీ హీరోయిన్లు చిల్లర లేక తెగ ఇబ్బంది పడ్డారు. అందులో ‘1 నేనొక్కడినే’ హీరోయిన్ కృతీ  సనన్ పరిస్థితి వింటే తప్పకుండా ‘అయ్యో పాపం’ అంటారు. తీవ్రమైన జ్వరంతోనూ లక్నోలో హిందీ చిత్రం ‘బరేలీ కి బర్ఫీ’ షూటింగ్ చేస్తున్నారు కృతి.

బుధవారం జ్వరం మరీ ఎక్కువ కావడంతో చిత్ర బృందం దగ్గరలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ప్రొడక్షన్ మేనేజర్‌తో పాటు కృతి పర్సులోనూ పాత రూ.500, 1,000 నోట్లు మాత్రమే ఉన్నాయి. ఆస్పత్రిలో అవి తీసుకోకపోవడంతో కార్డు ద్వారా బిల్ అమౌంట్ పే చేశారు. చివరకు మందులు కొనడానికి వందనోట్లు లేవు. ఏం చేయాలని ఆలోచిస్తున్న టైమ్‌లో దగ్గరలో ఎవరో రూ.1,000 నోటు తీసుకుని రూ.800 చిల్లర (వందనోట్లు) ఇస్తున్నారని తెలుసుకుని మందులు కొన్నారట. ఇక, నల్ల కలువ బిపాసా బసు ఫిట్‌నెస్ గురించి తెలిసిందే. జిమ్ చేసిన తర్వాత ఎగ్స్ తినడం ఆమెకు అలవాటు. అవి కొనడానికి వంద నోట్లు లేకపోవడంతో అప్పు తీసుకున్నానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement