అక్కీతో లక్కీ ఛాన్స్ | 1 heroine kriti sanon another chance to bollywood picture | Sakshi
Sakshi News home page

అక్కీతో లక్కీ ఛాన్స్

Published Thu, Jun 26 2014 12:29 AM | Last Updated on Wed, Jul 25 2018 2:35 PM

అక్కీతో  లక్కీ ఛాన్స్ - Sakshi

అక్కీతో లక్కీ ఛాన్స్

కృతీ సనన్ గుర్తుంది కదూ! ‘1’ సినిమాలో మహేశ్‌బాబు సరసన నటించిన 23 ఏళ్ల ఈ ఢిల్లీ భామకు తొలి సినిమాతోనే తెలుగునాట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత తెలుగులో చాలా మంచి అవకాశాలే వచ్చాయి. గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి తొలుత కృతీనే కథానాయికగా అనుకున్నారు. అయితే కృతి అప్పటికే హిందీలో ‘హీరోపంతి’ సినిమా ఒప్పుకోవడంతో తెలుగుకి కొంత విరామం ఇవ్వాల్సి వచ్చింది. సీనియర్ హీరో జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ హీరోగా రూపొందిన ‘హీరోపంతి’ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయినా, కృతీ సనన్‌కి మాత్రం మంచి కితాబులే దక్కాయి. దాంతో పాటే ఓ గొప్ప సినిమా ఛాన్స్ కూడా వచ్చింది. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందనున్న ‘సింగ్ ఈజ్ బ్లింగ్’లో కృతీని నాయికగా ఎంపిక చేశారు.

మొదట ఈ చిత్రంలో ఎవరెవరినో నాయికలుగా అనుకున్నారు. దర్శకుడు ప్రభుదేవా అనుకోకుండా ‘హీరోపంతి’ చూసి, వెనువెంటనే కృతీకి ఫోన్ చేసి ఈ సినిమా అవకాశాన్ని ఖరారు చేసేశారు. అక్కీ లాంటి సీనియర్ హీరోతో లక్కీ ఛాన్స్ కొట్టేసినందుకు కృతీ గాలిలో తేలుతోంది. తెలుగులో బన్నీ సరసన కూడా ఓ సినిమా చేయనుందని ఫిలిమ్‌నగర్ సమాచారం.    
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement