నటికి క్షమాపణ చెప్పిన కమెడియన్ | Krushna Abhishek Apologises to Tannishtha Chatterjee | Sakshi
Sakshi News home page

నటికి క్షమాపణ చెప్పిన కమెడియన్

Published Thu, Sep 29 2016 10:00 AM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

నటికి క్షమాపణ చెప్పిన కమెడియన్

నటికి క్షమాపణ చెప్పిన కమెడియన్

బాలీవుడ్‌ నటి తనిష్టా ఛటర్జీకి కమెడియన్ కృష్ణా అభిషేక్ క్షమాపణ చెప్పాడు. ‘కామెడీ నైట్స్‌ బచావో’ షోలో తన ఒంటిరంగును హేళన చేస్తూ జోకులు వేశారని తనిష్టా ఛటర్జీ ఆరోపించిన నేపథ్యంలో అభిషేక్ స్పందించాడు. ‘మా కార్యక్రమంలో ఏదైనా తప్పు జరిగిందని తనిష్టా ఛటర్జీ భావిస్తే మావైపు నుంచి ఆమెకు నేను క్షమాపణ చెబుతున్నాను. ఎవరినీ నొప్పించాలని, అవమానించాలని మేము అనుకోవడం లేదు. కామెడీ నైట్స్‌ బచావో షో రోస్ట్ ఫార్మాట్ లో సాగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యకరమైన హాస్యం అందించాలన్నదే మా ఉద్దేశమ’ని అభిషేక్ అన్నాడు.

తమ కార్యక్రమాన్ని చూసినవారంతా ఎంతో మెచ్చుకుంటున్నారని చెప్పాడు. షారూఖ్ ఖాన్, వరుణ ధావన్ లాంటి హీరోలు తమ సినిమాల ప్రచారం కోసం ఈ షోకు వచ్చారని గుర్తు చేశాడు. ’తనిష్టా ఛటర్జీకి ఎందుకు బాధ కలిగిందో నాకు తెలియదు. ఎందుకంటే ఆమె వెళ్లిపోయిన తర్వాత నేను వచ్చాను. ఆమెను బాధ పెట్టివుంటే క్షమించమని అడుగుతున్నాను. ఇదంతా కావాలని చేసింది కాద’ని అభిషేక్ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement