![Lady oriented heroine Anushka](/styles/webp/s3/article_images/2017/10/31/anushka.jpg.webp?itok=WSb6nzRh)
టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు కథానాయిక అనుష్క. ‘అరుంధతి’, ‘పంచాక్షరి’, ‘బాహుబలి’ సినిమాల్లో ఆమె పవర్‌ఫుల్ రోల్స్ చేశారు. త్వరలో విడుదల కానున్న ‘భాగమతి’ కూడా ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ అజిత్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎన్నై అరిందాల్’ చిత్రంలో అనుష్క నటించారు.
ఈ చిత్రం తెలుగులో ‘ఎంతవాడుగానీ’ పేరుతో విడుదలైంది. గౌతమ్ మీనన్‌తో వన్ మోర్ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో వచ్చే చాన్సుందని వినికిడి. అదే నిజమైతే అతడితో అనుష్కకు ఇది రెండో సినిమా. ఇక, ‘భాగమతి’ విషయానికొస్తే... షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ నెల 7న అనుష్క బర్త్‌డే. ఆ సందర్భంగా ఆమె లుక్‌ని రిలీజ్ చేయాలనుకుంటున్నారట.
Comments
Please login to add a commentAdd a comment