
'లెజెండ్' సక్సెస్ తో కొత్త శిఖరాలకు...
'లెజెండ్' విజయంతో టాలీవుడ్ లో తన స్థానం పదిలమైందని హీరోయిన్ సోనాల్ చౌహాన్ పేర్కొంది.
చెన్నై: 'లెజెండ్' విజయంతో టాలీవుడ్ లో తన స్థానం పదిలమైందని హీరోయిన్ సోనాల్ చౌహాన్ పేర్కొంది. ఈ సినిమా సక్సెస్ తో తెలుగులో అవకాశాలు పెరిగాయని వెల్లడించింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'లెజెండ్' సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా 400 రోజులు పూర్తి చేసుకుంది. ఈ విజయం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని సోనాల్ చెప్పింది.
తెలుగు అభిమానులు తనను ఎంతో ఆదరిస్తున్నారని మురిసిపోయింది. వారి అభిమానాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదన్నారు. 'లెజెండ్' విజయం తన కెరీర్ కొత్త శిఖరాలకు తీసుకెళ్లిందని పేర్కొంది. తాజాగా 'పండగ చేస్కో' సినిమాలో నటించానని చెప్పింది. షేర్, సైజ్ జీరో సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుతం తన కెరీర్ రైట్ డైరెక్షన్ లో వెళుతోందని సోనాల్ చౌహాన్ పేర్కొంది.