హాలీవుడ్ దర్శకుడికి ‘గొల్లపూడి’ అవార్డు
తమిళసినిమా: గొల్లపూడి శ్రీనివాస్ జాతీ య అవార్డు పొందే అదృష్టం ఈసారి లెన్స్ ఆంగ్ల చిత్ర దర్శకుడు జయప్రకాశ్ రాధాకృష్ణన్‌ను వరించింది. దర్శకుడిగా తొలిసారి మోగాఫోన్ పట్టి షూటింగ్ స్పాట్‌లోనే అకాల మరణానికి గురైన గొల్లపూడి శ్రీనివాస్ పేరుతో గొల్లపూడి శ్రీనివాస్ స్మారక ట్రస్ట్ నిర్మాహకులు జీవీ.రామకృష్ణ, జీవీ.సుబ్బారావు 18 ఏ ళ్లుగా గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవా ర్డు ప్రదాన వేడుకను నిర్వహస్తూ వస్తున్నారు. తొలి ఉత్తమ చిత్రాల దర్శకుల్ని ప్రోత్సహించాలన్న ఉత్తమ ఆశయంతో నిర్వహిస్తున్న గొల్లపూడి శ్రీనివాస్ జాతీ య అవార్డుకు అత్యున్నత గుర్తింపు లభించడం గమనార్హం. 2015వ ఏడాదికిగాను 19 గొల్లపూడి శ్రీనివాస్ జాతీ య అవార్డు వివరాలను నిర్వాహకులు వెల్లడించారు.
ఆంగ్ల చిత్రం రైట్స్ దర్శకుడు జయప్రకాష్ రాధాకృష్ణన్ ఈ ఏడాది అవార్డును ప్రదానం చేయనున్న ట్లు తెలిపారు. ఈ అవార్డుల జ్యూరీ మెం బర్‌లుగా ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, శ్రీ వసంత సాయి, నటి రోహిణి వరించారు. ఈ అవార్డు ఎంపికకు హిందీ, ఇంగ్లిషు, మలయాళం, త మిళం, అసోం, బెంగాలీ, కన్నడం భాషలకు చెందిన 33 చిత్రాలను నామినేషన్‌కు రాగా వాటిలో ఆంగ్ల చిత్రం లెన్స్‌ను ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఆ చిత్ర ద ర్శకుడు జయప్రకాష్ రాధాకృష్ణన్‌కు ఆగ స్టు 12న స్థానిక రాయపేటలోని మ్యూ జిక్ అకాడమీలో నిర్వహించనున్న అవా ర్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో లక్షన్నర నగదు బహుమతితో పాటు జ్ఞాపికను వరించనున్నట్లు పేర్కొన్నారు.