director Jayaprakash Radhakrishnan
-
నో స్క్రిప్ట్ నోరీటేక్స్
కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కథానాయిక శ్రుతీహాసన్. కానీ హీరోయిన్గా కాదు. నిర్మాతగా. అయితే సినిమా పూర్తయ్యాక నిర్మాతగా కమిట్ అయ్యారు. విచిత్రంగా ఉంది కదూ. విషయంలోకి వస్తే... ఇసిడ్రో ప్రొడక్షన్స్ పతాకంపై ‘లెన్స్’ ఫేమ్ జయప్రకాశ్ రాధాకృష్ణన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘ది మస్కిటో ఫిలాసఫీ’. ఈ సినిమాకే నిర్మాతగా ముందుకొచ్చారు శ్రుతీ. మ్యూజిక్ డైరెక్టర్‌గా, హీరోయిన్గా సక్సెస్ సాధించిన శ్రుతీ ఇప్పుడు నిర్మాతగా కూడా విజయం సాధించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ‘‘ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ కంటెంట్ సినిమాలను ఇసిడ్రో ప్రొడక్షన్స్ ద్వారా ఆడియన్స్‌కు అందించాలనుకుంటున్నాం. ‘ది మస్కిటో ఫిలాసఫీ’ అలాంటి చిత్రమే అని నమ్ముతున్నాం. ‘లెన్స్’ వంటి మంచి చిత్రం తీసిన జయప్రకాశ్‌తో అసోసియేట్ అవ్వడం ఆనందంగా ఉంది. ఆయన స్టోరీ టెల్లింగ్ కొత్తగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. అలాగే ఈ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేశారామె. ఆ పోస్టర్‌పై ‘నో స్క్రిప్ట్.. నో రీటేక్స్’ అని ఉండటం విశేషం. చిత్రదర్శకుడు జయప్రకాశ్ మాట్లాడుతూ–‘‘రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలను ఆడియన్స్‌కు అందించాలని నిర్మాతలు కోరుకుంటారు. అలా గుడ్ కంటెంట్‌తో ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే సినిమానే ‘ది మస్కిటో ఫిలాసఫీ’. ట్రెడిషన్ అండ్ మోడ్రనిటీ బ్యాక్‌డ్రాప్‌లో నలుగురు స్నేహితుల చుట్టూ ఈ సినిమా సాగుతుంది. స్క్రిప్ట్, డైలాగ్స్ లేకుండా చిత్రీకరించాం’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘సారిక (నటి, శ్రుతీహాసన్ తల్లి) మేడమ్‌తో ఈ సినిమా గురించి చెప్పాను. ఆ తర్వాత శ్రుతీహాసన్గారి ఇసిడ్రో మీడియా మూవీ బోర్డ్లోకి వచ్చింది. నా టాలెంట్ అండ్ విజన్‌ని నమ్మినందుకు చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
హాలీవుడ్ దర్శకుడికి ‘గొల్లపూడి’ అవార్డు
తమిళసినిమా: గొల్లపూడి శ్రీనివాస్ జాతీ య అవార్డు పొందే అదృష్టం ఈసారి లెన్స్ ఆంగ్ల చిత్ర దర్శకుడు జయప్రకాశ్ రాధాకృష్ణన్‌ను వరించింది. దర్శకుడిగా తొలిసారి మోగాఫోన్ పట్టి షూటింగ్ స్పాట్లోనే అకాల మరణానికి గురైన గొల్లపూడి శ్రీనివాస్ పేరుతో గొల్లపూడి శ్రీనివాస్ స్మారక ట్రస్ట్ నిర్మాహకులు జీవీ.రామకృష్ణ, జీవీ.సుబ్బారావు 18 ఏ ళ్లుగా గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవా ర్డు ప్రదాన వేడుకను నిర్వహస్తూ వస్తున్నారు. తొలి ఉత్తమ చిత్రాల దర్శకుల్ని ప్రోత్సహించాలన్న ఉత్తమ ఆశయంతో నిర్వహిస్తున్న గొల్లపూడి శ్రీనివాస్ జాతీ య అవార్డుకు అత్యున్నత గుర్తింపు లభించడం గమనార్హం. 2015వ ఏడాదికిగాను 19 గొల్లపూడి శ్రీనివాస్ జాతీ య అవార్డు వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. ఆంగ్ల చిత్రం రైట్స్ దర్శకుడు జయప్రకాష్ రాధాకృష్ణన్ ఈ ఏడాది అవార్డును ప్రదానం చేయనున్న ట్లు తెలిపారు. ఈ అవార్డుల జ్యూరీ మెం బర్లుగా ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, శ్రీ వసంత సాయి, నటి రోహిణి వరించారు. ఈ అవార్డు ఎంపికకు హిందీ, ఇంగ్లిషు, మలయాళం, త మిళం, అసోం, బెంగాలీ, కన్నడం భాషలకు చెందిన 33 చిత్రాలను నామినేషన్‌కు రాగా వాటిలో ఆంగ్ల చిత్రం లెన్స్‌ను ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఆ చిత్ర ద ర్శకుడు జయప్రకాష్ రాధాకృష్ణన్‌కు ఆగ స్టు 12న స్థానిక రాయపేటలోని మ్యూ జిక్ అకాడమీలో నిర్వహించనున్న అవా ర్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో లక్షన్నర నగదు బహుమతితో పాటు జ్ఞాపికను వరించనున్నట్లు పేర్కొన్నారు.