డబుల్‌ డోస్‌! | manchu manoj Double dose! | Sakshi
Sakshi News home page

డబుల్‌ డోస్‌!

Published Wed, Sep 6 2017 12:13 AM | Last Updated on Tue, Sep 19 2017 12:54 PM

డబుల్‌ డోస్‌!

డబుల్‌ డోస్‌!

మంచు మనోజ్‌ నటించిన తాజా సినిమా ‘ఒక్కడు మిగిలాడు’. అనీషా ఆంబ్రోస్‌ కథానాయిక. అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి దర్శకత్వంలో ఎస్‌.ఎన్‌. రెడ్డి, ఎన్‌. లక్ష్మీకాంత్‌ నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో మనోజ్‌ ఎల్‌టీటీఈ మిలిటెంట్‌ చీఫ్‌ ప్రభాకరన్‌గా, యువ విద్యార్థిగా కనిపిస్తారు. ఇప్పటి వరకూ చూడని విధంగా అద్భుతంగా నటించారు.

25 నిమిషాల పాటు జరిగే యుద్ధ సన్నివేశాలతో పాటు 35 నిమిషాలు సముద్రంలో సాగే ప్రయాణం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ పనులు ఎక్కువగా ఉన్నందున తొలుత ప్రకటించిన తేదీకి సినిమా రావడం లేదు. ఎప్పుడు విడుదల చేస్తామన్నది వారంలో ప్రకటిస్తాం’’ అన్నారు. అజయ్, జెన్నీఫర్, మురళీమోహన్, సుహాసిని, బెనర్జీ, మిలింద్‌ గునాజి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శివ నందిగామ, కెమెరా: వి.కోదండ రామరాజు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement