పవర్‌... ప్లస్‌ కామెడీ! | mohankrishna is bhadragiry new film start at hyderabad | Sakshi
Sakshi News home page

పవర్‌... ప్లస్‌ కామెడీ!

Published Wed, May 24 2017 12:31 AM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM

పవర్‌... ప్లస్‌ కామెడీ!

పవర్‌... ప్లస్‌ కామెడీ!

మోహన్‌కృష్ణ, జాహిదా సామ్‌ జంటగా జనార్ధన్‌ బోదాసు దర్శకత్వంలో మరిపి విద్యాసాగర్, జె.యన్‌.ఆర్‌. నిర్మిస్తున్న ‘భద్రగిరి’ హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ నగర్‌ సాయిబాబా గుడిలో ప్రారంభమైంది.

దర్శకుడు మాట్లాడుతూ – ‘‘టైటిల్‌కు తగ్గట్టు పవర్‌పుల్‌ కథతో రూపొందుతోన్న ఈ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లో హీరో క్యారెక్టర్‌ కూడా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ‘జబర్దస్త్‌’ టీమ్‌ చేసే కామెడీ ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. జూన్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు. రఘుబాబు, రవివర్మ, సుమంత్‌శెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రమేశ్‌ నాయుడు.

Advertisement

పోల్

Advertisement