రాజుగారితో...
‘‘ఈ ఫ్రేమ్ (ఫొటో)లోని రంగు ప్రేమే. నాగార్జునగారికి జోడీగా నటిస్తున్నాను. ఓ స్వప్నం నిజమైనట్టుంది’’ అంటున్నారు . ప్రేమ రంగు ఏంటి అనేకదా మీ డౌట్. ఇక్కడ కనిపిస్తున్నది బ్లాక్ అండ్ వైట్ ఫొటో కాబట్టి, సీరత్ అలా అన్నారు. ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ‘రాజుగారి గది–2’లో నాగార్జునకు జోడీగా ఆమె నటిస్తున్నారు. భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’ తర్వాత నాగార్జున చేస్తున్న ఈ థ్రిల్లర్ మూవీ చిత్రీకరణ ఇటీవల మొదలైంది.
మంగళవారం నాగార్జున చిత్ర బృందంతో జత కలిశారు. ఈ షూటింగ్‌లో దిగిన బ్లాక్ అండ్ వైట్ సెల్ఫీని సీరత్ కపూర్ ట్వీట్ చేశారు. సమంత, అశ్విన్‌బాబు, ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని పీవీపీ సినిమాస్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఎస్.ఎస్. తమన్ స్వరకర్త.