రొమాంటిక్ సోగ్గాడు | Nagarjuna new film titled 'Soggade Chinni Naayana' | Sakshi
Sakshi News home page

రొమాంటిక్ సోగ్గాడు

Published Tue, Oct 28 2014 10:49 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

రొమాంటిక్ సోగ్గాడు - Sakshi

రొమాంటిక్ సోగ్గాడు

నాగార్జున సోలో హీరోగా కనిపించి ఏడాది దాటింది. ‘భాయ్’ తర్వాత ఆయన సోలో హీరోగా సినిమా రాలేదు. ‘మనం’, ‘ఒక లైలా కోసం’ విజయాలతో అటు నటునిగా, ఇటు నిర్మాతగా జోష్ మీదున్నారాయన. ఈ ఆనందంలోనే సోలో హీరోగా కూడా హిట్టు కొట్టేయాలనే పట్టుదలతో ఉన్నారు నాగ్. అందుకే... నవంబర్ 15న తన సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. కల్యాణకృష్ణ దర్శకత్వంలో ‘అష్టాచమ్మా’ రామ్మోహన్ నిర్మాతగా నాగార్జున నటించనున్న ఈ చిత్రానికి ‘సోగ్గాడే చిన్ని నాయన’ అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారు. టైటిల్‌కి తగ్గట్టే ఇందులో నాగ్ కేరక్టర్‌ని దర్శకుడు రొమాంటిగ్గా డిజైన్ చేశాడని సమాచారం. చాలాకాలం తర్వాత ఇందులో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించనుండటం విశేషం. మరో నాయిక కోసం ‘లెజెండ్’ బ్యూటీ సోనాల్‌చౌహాన్, దీక్షాసేథ్ తదితరులు పరిశీలనలో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement