కోలీవుడ్ మీద కన్నేసిన సోగ్గాడు | Nagarjuna Soggade Chinni Nayana Goes To Tamil | Sakshi
Sakshi News home page

కోలీవుడ్ మీద కన్నేసిన సోగ్గాడు

Published Fri, Jan 27 2017 12:31 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

కోలీవుడ్ మీద కన్నేసిన సోగ్గాడు - Sakshi

కోలీవుడ్ మీద కన్నేసిన సోగ్గాడు

ప్రయోగాత్మక చిత్రాలు చేయటమే కాదు, వాటినొ కమర్షియల్ సక్సెస్ చేయటంలోనూ కింగ్ అనిపించుకున్నాడు సీనియర్ హీరో నాగార్జున. ఇప్పటికే టాలీవుడ్లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న కింగ్ ఇప్పుడు తమిళ మార్కెట్ మీద దృష్టి పెట్టాడు. ఇటీవల ఊపిరి సినిమాను తోళాగా తమిళనాట కూడా రిలీజ్ చేసి సక్సెస్ సాధించిన నాగార్జున, మరో తెలుగు సినిమాను తమిళ్లో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

గత ఏడాది సంక్రాంతి బరిలో సూపర్ హిట్గా నిలిచిన సోగ్గాడే చిన్నినాయనా సినిమాను తమిళ్లో రిలీజ్ చేయనున్నాడు. నాగార్జున అచ్చమైన పల్లెటూరి కథతో చేసిన ఈ సినిమాను తమిళ్లో 'సోక్కాలి మైనర్' అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు పల్లెటూరి యాసతో నాగ్ చెప్పిన డైలాగ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకొని జాగ్రత్తగా డబ్బింగ్ పనులు చేస్తున్నారట. ఫిబ్రవరిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement