ఆ పాత్ర చేయడం ఉత్తేజకరంగా ఉంది: అక్కినేని నాగార్జున | Nagarujuna visits tirupathi shrine, announces his new film named ' Namo Venkatesaaiah' | Sakshi
Sakshi News home page

ఆ పాత్ర చేయడం ఉత్తేజకరంగా ఉంది: అక్కినేని నాగార్జున

Published Thu, Jun 23 2016 9:51 PM | Last Updated on Tue, Oct 2 2018 2:44 PM

ఆ పాత్ర చేయడం ఉత్తేజకరంగా ఉంది: అక్కినేని నాగార్జున - Sakshi

ఆ పాత్ర చేయడం ఉత్తేజకరంగా ఉంది: అక్కినేని నాగార్జున

తిరుమల: 'ఓం నమో వేంకటేశాయః' చిత్రం ద్వారా శ్రీవేంకటేశ్వర స్వామివారి భక్తుడు హథీరాం పాత్రను చేస్తుండటం ఉత్తేజకరంగా ఉందని సినీహీరో అక్కినేని నాగార్జున అన్నారు. గురువారం ఉదయం ఆయన తన సతీమణి అమలతో కలిసి స్వామివారిని దర్శించకున్నారు. వీరి వెంట దర్శకుడు కే రాఘవేంద్రారావు, నిర్మాత ఎ.మహేశ్వరరెడ్డిలతో పాటు సాంకేతిక బృందం కూడా ఉన్నారు.

చిత్ర నిర్మాణం ప్రారంభంకావడానికి ముందు చిత్రం విజవంతం కావాలని గర్భాలయ మూలమూర్తకి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం వెలుపల నాగార్జన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని చిత్రం పేరును 'ఓం నమో వేంకటేశాయః' గా ప్రకటించారు. అన్నమయ్య సినిమాలానే ఈ చిత్రంలో కూడా భక్తుడి పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల25 నుంచి షూటింగ్ ను ప్రారంభిస్తామన్నారు. అన్నమయ్య తర్వాత ఓం నమో వేంకటేశాయః చిత్రానికి దర్శకత్వం వహించడం అద్భుత అవకాశమని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement