ఆమె అసలు బాలయ్య కూతురేనా?
ఆమె అసలు బాలయ్య కూతురేనా?
Published Mon, Sep 18 2017 11:00 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM
సాక్షి, సినిమా: గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్న టాలీవుడ్ టాప్‌హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం 102వ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారనే ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం.
నయనతార లీడ్ హీరోయిన్ కాగా, మళయాళం బ్యూటీ నటాషా దోషిని ఈ మధ్యే తీసేసుకున్నారు. అయితే ఇందులో బాలయ్యకు నటాషాకు మధ్య రొమాన్స్ ఉండబోదనే సమాచారం ఇప్పుడు అందుతోంది. బాలయ్య-నయనతార కూతురిగా నటాషా కనిపించబోతుందని, ఆమె క్యారెక్టర్ చుట్టూనే కథ మొత్తం తిరుగుతుందని చెబుతున్నారు. నటాషాకి ఎదురయ్యే సమస్యలను తీర్చే వ్యక్తిగా బాలయ్య కనిపించబోతున్నారని టాక్. ఇక మూడో హీరోయిన్ సెలక్షన్ ఇంకా పూర్తి కాలేదని అంటున్నారు.
ప్రస్తుతం తమిళనాడు.. కుంభకోణంలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సీ కళ్యాణ్ నిర్మాత కాగా, 2018 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కాబోతుంది.
Advertisement
Advertisement