పట్టినపాక్కం చిత్రీకరణ పూర్తి | Pattinapakkam movie shooting completed | Sakshi
Sakshi News home page

పట్టినపాక్కం చిత్రీకరణ పూర్తి

Published Fri, Dec 2 2016 2:23 AM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM

పట్టినపాక్కం చిత్రీకరణ పూర్తి

పట్టినపాక్కం చిత్రీకరణ పూర్తి

పట్టినపాక్కం చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుందని ఆ చిత్ర దర్శకుడు జయదేవ్ వె ల్లడించారు. ముల్లై మూ ట్టిల్ ప్రొడక్షన్‌‌స పతాకంపై రోహిత్ ముల్లై మూట్టిల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెడ్రాస్ చి త్రం ఫేమ్ కలైయరసన్ హీరోగా నటిస్తున్నారు.ఆ యనకు జంటగా ఈగో, యామిరుక్క భయమే చి త్రాల ఫేమ్ అణవ్వరకుమార్ నటిస్తున్నారు.ము ఖ్య పాత్రల్లో నటి చాయాసింగ్, జాన్‌విజయ్, ఆర్.సుందరరాజన్, చార్లీ,ఎంఎస్.భాస్కర్ నటిస్తున్నారు.

ఇషాన్‌దేవ్ సంగీతాన్ని,రాణా ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర వివరాలను దర్శకుడు లె లుపుతూ పట్టభద్రుడైన హీరో కుటుంబం పేదరికంలో మగ్గుతుందన్నారు. దీంతో ఎలాగైనా త్వరగా ధనవంతుడిగా మారాలని నిర్ణరుుంచుకున్న హీరో కొందర్ని గురిగా పెట్టుకుని అడ్డదారిలో డబ్బు సంపాదించడానికి సిద్ధం అవుతాడన్నారు. అరుుతే అతని పథకం దిశ మారి తననే చిక్కుల్లో పడేస్తుందన్నారు.అరుుతే హీరోను సమస్యల్లో నెట్టిన వారు ఏ ఉద్దేశంతో కుట్ర పన్నారు? వారి కుట్ర నుంచి హీరో ఎలా బయట పడ్డాడు? ఇత్యాధి అంశాలతో కథ వేగంగా నడుస్తుందని తెలిపారు.ఈ చిత్ర విడుదల హక్కుల్సి ఎస్‌పీ.సినిమాస్ సంస్థ పొందిందని దర్శకుడు చెప్పారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement