ఇది అగ్ర నిర్మాతల కుట్ర - ప్రతాని రామకృష్ణ గౌడ్ | producers Sector Chairman pratani ramakrishna goud | Sakshi
Sakshi News home page

ఇది అగ్ర నిర్మాతల కుట్ర - ప్రతాని రామకృష్ణ గౌడ్

Published Thu, Jul 21 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

ఇది అగ్ర నిర్మాతల కుట్ర  - ప్రతాని రామకృష్ణ గౌడ్

ఇది అగ్ర నిర్మాతల కుట్ర - ప్రతాని రామకృష్ణ గౌడ్

‘‘మంగళవారం నాడు జరిగిన నిర్మాతల సెక్టార్ చైర్మన్ ఎన్నికల్లో నన్ను చైర్మన్ పదవి నుంచి అప్రజాస్వామికంగా తొలగించారు’’ అని నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ - ‘‘ఇతర రాష్ట్రాల్లో క్యూబ్, యుఎఫ్‌ఓ, పిఎక్స్‌డి పద్ధతుల ద్వారా చిత్రాన్ని విడుదల చేయడానికి రూ.3 వేలు వసూలు చేస్తుండగా.. తెలుగులో రూ.11 వేలు వసూలు చేస్తున్నారు.
 
 తద్వారా చిన్న నిర్మాతలు చాలా నష్టపోతు న్నారు. కమిటీ వేసి, ఈ విషయంలో ఓ నిర్ణయానికి రావాలని నేను కోరుతుంటే జాప్యం చేస్తున్నారు. ఎందుకంటే క్యూబ్‌లో అల్లు అరవింద్, యుఎఫ్‌ఓ లో సురేశ్‌బాబు పార్టనర్స్. అలాగే, నిర్మాత విజయేందర్ రెడ్డితో నాకు థియేటర్ల విషయంలో పలుమార్లు గొడవ జరిగింది. ఇప్పుడు అగ్ర నిర్మాతలిద్దరూ వెనక ఉండి విజయేందర్‌ని ముందుకు నడిపించి, నన్ను నిర్మాతల సెక్టార్ చైర్మన్ పదవి నుండి తొలగించారు’’ అని ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement