లెక్క చేయకుండా...
రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూ. 25 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందుతోన్న సినిమా ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎం’. శివాని శివాత్మిక ఫిలింస్ సమర్పణలో ఎం. కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల 40 రోజులు యురాషియన్ దేశాల్లో జరిగింది.
హీరో రాజశేఖర్ మాట్లాడుతూ – ‘‘మేం షూటింగ్ చేసిన లొకేషన్లకు 100 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా హోటల్స్ కూడా లేవు. టీమ్ అంతా క్యాంపుల్లో బస చేసి వర్క్ చేశారు’’ అన్నారు. ‘‘స్క్రిప్ట్ డిమాండ్ మేరకు సెన్సిటివ్ ఏరియాల్లో షూటింగ్ చేశాం. వాతావరణాన్ని లెక్క చేయకుండా నటీనటులు, సాంకేతిక నిపుణులు సపోర్ట్ చేశారు. మా స్టంట్ టీమ్ టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 40 రోజుల్లో 33 రోజుల పాటు జార్జియాలో కీలక సన్నివేశాలు చిత్రీకరించాం’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, శ్రీచరణ్ పాకాల.