కోలీవుడ్ బ్రూస్లీ
బ్రూస్లీ పేరు వినగానే కరాటే, కుం గ్‌ఫూ వంటి మార్షల్ ఆర్ట్స్ గుర్తుకొస్తాయి. అంత పేరుమోసిన హాలీవుడ్ నటుడు బ్రూస్లీ. ఆ తరహాలో తాజాగా కోలీవుడ్ నుంచి ఒక బ్రూస్లీ వస్తున్నాడు. ఈయన అసలు పేరు బ్రూస్. ఈయన నటిస్తున్న చిత్రం పుదియ బ్రూస్లీ. శ్రీ దిండుగల్ వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై రూపొం దిస్తున్న ఈ తమిళ చిత్రాన్ని నవ దర్శకుడు ముళైయూర్ ఎ.సోణై దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ గ్రామం నుంచి నగరంలోని మామ ఇంటికి వచ్చిన ఒక యువకుడు అక్కడ ఒక స్థల వివాదాన్ని ఎలా పరిష్కరించాడన్నదే చిత్ర కథ అని చెప్పారు.
ఇందులో హీరోగా నటించిన బ్రూస్ చెన్నైకి చెందిన వారని తెలిపారు. కరాటేలో రెండు సార్లు బ్లాక్ బెల్ట్ పొందారని చెప్పారు. ఇది లోబడ్జెట్ చిత్రం అయినా తమిళ చిత్ర పరిశ్రమలో ఇదొక సరికొత్త యాక్షన్ చిత్రంగా గుర్తింపు పొందుతుందనే అభిప్రాయపడ్డారు. హాలీవుడ్ నటుడు బ్రూస్లీ చిత్రాల తరహాలో ఈ పుదియ బ్రూస్లీ చిత్రాన్ని తెరకెక్కిం చినట్లు చెప్పారు. సూపర్ యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం మాస్ ఆడియన్స్‌ను అలరిస్తుందన్నారు. చిత్రంలో యాక్షన్ సన్నివేశాలను ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ శేఖర్ బ్రహ్మాండంగా కంపోజ్ చేశారని తెలిపారు. హీరోయిన్‌గా రసియా అనే నూతన నటి నటించగా ఇతర పాత్రల్లో హేమంత్, తెన్నవన్, శక్తివేల్, తిలక్, ఐశ్వర్య శంకర్ తదితరులు నటించారని దర్శకుడు చెప్పారు.