బ్రేకింగ్‌ న్యూస్‌ | Ram Gopal Varma Tweets About Power Star Movie | Sakshi
Sakshi News home page

బ్రేకింగ్‌ న్యూస్‌

Published Mon, Jun 29 2020 1:07 AM | Last Updated on Mon, Jun 29 2020 1:07 AM

Ram Gopal Varma Tweets About Power Star Movie - Sakshi

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తాజాగా ‘పవర్‌ స్టార్‌’ అనే సినిమా చేయబోతున్నట్లు ట్వీటర్‌ వేదికగా ప్రకటించారు. ‘‘బ్రేకింగ్‌ న్యూస్‌: ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌లో కొత్త సినిమాకు ‘పవర్‌ స్టార్‌’ అని పేరు పెట్టాం. ఇందులో పీకే, ఎమ్‌ఎస్, ఎన్‌బీ, టీఎస్, ఓ రష్యన్‌ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ ముఖ్య పాత్రలు చేయనున్నారు. ఈ సినిమాలోని పాత్రలు ఎవరో అర్థం చేసుకోవడానికి ఎటువంటి బహుమతులు ఇవ్వబడవు’’ అని పేర్కొన్నారు. అంతేకాదు.. ఓ వ్యక్తి వీడియోను కూడా విడుదల చేసి, ‘‘నా ‘పవర్‌ స్టార్‌’ చిత్రంలో నటించే హీరో ఇతనే. అతను మా కార్యాలయానికి వచ్చినప్పుడు ఈ షాట్‌ చిత్రీకరించాం. ఇతన్ని ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తే అది యాధృచ్చికమే’’ అని కూడా వర్మ ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement