హీరో ఇంటికి మరో హీరో భార్య డిజైన్‌ | Ranbir Kapoor Moves Into New Home, Invites Gauri Khan Over | Sakshi
Sakshi News home page

హీరో ఇంటికి మరో హీరో భార్య డిజైన్‌

Published Fri, Dec 16 2016 11:52 AM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM

హీరో ఇంటికి మరో హీరో భార్య డిజైన్‌

హీరో ఇంటికి మరో హీరో భార్య డిజైన్‌

ముంబై: బాలీవుడ్‌ యువ హీరో రణబీర్‌ కపూర్‌ ఇటీవల కొత్త ఇంట్లోకి వెళ్లాడు. ముంబై శివారు పాలి హిల్స్‌లో రణబీర్‌ ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశాడు. బాలీవుడ్‌ బాద్షా షారుక్‌ ఖాన్‌ భార్య గౌరీ ఖాన్‌ ఈ ఇంటికి డిజైన్‌ చేయడం విశేషం. ఇంటీరియర్‌ డెకరేటర్‌గా ఆమెకు మంచి పేరుంది.

బుధవారం రాత్రి రణబీర్‌ బాలీవుడ్‌ ప్రముఖులకు విందు ఇచ్చాడు. ఈ పార్టీకి దర్శకుడు కరణ్‌ జోహార్‌, గౌరీ ఖాన్‌ తదితర ప్రముఖులు హాజరయ్యారు. రణబీర్‌ అపార్ట్‌మెంట్‌లో అతనితో కలసి దిగిన ఫోటోను గౌరీ ఖాన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. రణబీర్‌ కొత్త ఇంటిని అందంగా తీర్చిదిద్దినందుకు అతని తల్లిదండ్రులు నీతూ కపూర్‌, రిషి కపూర్‌లు.. గౌరీ ఖాన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. రణబీర్‌ కుటుంబం చెంబూరులోని కపూర్‌ కాటేజ్‌లో ఉంటోంది. రణబీర్‌ కూడా తన బామ్మ కృష్ణరాజ్‌ కపూర్‌తో కలసి అక్కడే ఉండేవాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement