రాణీ ముఖర్జీ తన తదుపరి చిత్రం ‘హిచ్కీ’ ప్రమోషన్ మెదలు పెట్టనున్నారు. సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్ ఎవరైనా చేస్తారు.. అందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ 60 డేస్ ప్రమోషన్ కోసం కేటాయించారామె. ఎందుకిలా? అంతగా ఎందుకు ప్రమోట్ చేయాలి? అంటే.. నాలుగేళ్ల తర్వాత రాణి నటించిన చిత్రం ‘హిచ్కీ’. పెళ్లయి, తల్లయ్యాక నటించిన సినిమా. అందుకని ఈ సినిమా ఆమెకు ఓ స్పెషల్.
ఇంకో స్పెషల్ ఏంటంటే.. ఇందులో ఆమె టూరెట్ సిండ్రోమ్ అనే నెర్వస్ డిజార్డ్‌తో బాధపడుతున్న నైనా మతూర్ పాత్రలో కనిపించబోతున్నారు. డిఫరెంట్ క్యారెక్టర్. మనలోని లోపాలని మన అవకాశాలుగా మలుచుకుని, వాటిని చాలెంజ్ చేసి గెలవటం అనే కథాంశంతో తీసిన సినిమా ఇది. అందుకని బాగా ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. ఎంతైనా 60 రోజులు చేస్తారా? అంటే.. కంటిన్యూస్‌గా చేయడంలేదు. కొంచెం గ్యాప్ తీసుకుని చేస్తారు. ఒక్క ముంబైలోనే కాదు.. దేశంలోని పలు కాలేజీలు, స్కూల్స్‌ను సందర్శించనున్నారామె. ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment