సీనియర్ హీరోయిన్, ఆమె భర్తపై కేసు నమోదు | Rathi Agnihotri, husband booked for electricity theft | Sakshi
Sakshi News home page

సీనియర్ హీరోయిన్, ఆమె భర్తపై కేసు నమోదు

Published Fri, Jan 20 2017 11:00 AM | Last Updated on Wed, Sep 5 2018 1:46 PM

సీనియర్ హీరోయిన్, ఆమె భర్తపై కేసు నమోదు - Sakshi

సీనియర్ హీరోయిన్, ఆమె భర్తపై కేసు నమోదు

బాలీవుడ్తో పాటు దక్షిణాదిలోనూ గ్లామర్ క్వీన్గా వెలుగొందిన అలనాటి హీరోయిన్ రతీ అగ్నిహోత్రిపై ముంబైలోని వోర్లీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విద్యుత్ శాఖకు తప్పుడు సమాచారం ఇచ్చి 46 లక్షలకు పైగా విద్యుత్ చార్జీ కట్టకుండా తప్పించుకున్నందుకు గాను రతీ అగ్నిహోత్రితో పాటు ఆమె భర్త అనిల్ విర్వాణీలపై ఎలక్ట్రిసిటీ యాక్ట్ సెక్షన్ 135 కింద కేసు నమోదు చేశారు.

ముంబైలోని వోర్లీ సముద్ర తీరంలో ఉంటున్న అగ్రిహోత్రి ఇంటికి త్రీ ఫేస్ మీటర్ ఉన్నప్పటికీ., విద్యుత్ శాఖకు సింగిల్ ఫేస్ మీటర్ ఉన్నట్టుగా చూపించి తక్కువ చార్జీలను చెల్లించినట్టుగా విద్యుత్ శాఖ అధికారులు గుర్తించారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ విచారణలో విద్యుత్ చౌర్యం జరిగినట్టుగా తేలటంతో అగ్నిహోత్రి దంపతులపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement