
వేశ్యగా నటించనున్న శ్రుతీ హాసన్
ప్రముఖ కథానాయికలంతా వేశ్య పాత్రల్లో రాణించారు. ఆ జాబితాలో శ్రుతీ హాసన్ కూడా ఉన్నారు. కెరీర్ తొలినాళ్లలో ఆమె హిందీలో ‘డి-డే’ అనే సినిమాలో వేశ్యగా నటించారు. తెలుగులో ‘గెలుపు గుర్రం’గా అనువాదమైంది. సి.ఆర్. రాజన్ సమర్పణలో డర్ సినిమా మరియు సురేష్ సినిమా సంయుక్త నిర్మాణంలో సురేష్ దూడల ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు ముందు తీసుకు వస్తున్నారు. మాఫియా నేపథ్యంలో నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అర్జున్ రామ్‌పాల్, ఇర్ఫాన్‌ఖాన్, రిషికపూర్, అనిల్ కపూర్, నాజర్ ముఖ్య తారలుగా నటించారు. ఈ నెలాఖరున విడుదల కానున్న ఈ సినిమా గురించి సురేష్ దూడల మాట్లాడుతూ -‘‘ఇందులో శ్రుతీ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్‌గా కనిపిస్తారు. ఆమె నటించిన వేడి వేడి సన్నివేశాలు ఈ చిత్రానికే ప్రధాన ఆకర్షణ’’ అని తెలిపారు.