
సాక్షి, సినిమా : లెజెండరీ గాయని పీ సుశీల క్షేమంగా ఉన్నారు. ఆరోగ్యం క్షీణించటంతో గురువారం రాత్రి ఆమె చనిపోయారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయ్యింది. దీంతో పలువురు నివాళులర్పిస్తూ తమ సంతాపం తెలియజేశారు.
ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న ఆమె ఓ వీడియో సందేశంలో తాను పూర్తి ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను అమెరికా పర్యటనలో ఉన్నానని.. శనివారం తిరిగి ఇండియాకు వస్తానని ఆమె అందులో చెప్పారు. మరోవైపు కోలీవుడ్‌కు చెందిన పబ్లిక్ రిలేషన్ అధికారిణి రియాజ్ అహ్మద్ కూడా ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందంటూ ఓ ఫోటోను తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆమె డల్లాస్‌లో ఉన్నట్లు ఆయన తెలియజేశారు.
81 ఏళ్ల సుశీల దక్షిణా భాషలతోపాటు హిందీ, సింహళంలో కూడా పాటలు పాడిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment