Singer Susheela
-
ప్రముఖ గాయని పి సుశీలకు అస్వస్థత
-
నా ఫేవరెట్ గాయనీ ఎవరంటే: సింగర్ సునీత
-
ఘంటసాల గారు నేను సంగీతం కోసమే పుట్టాం
-
ఆరోజు ఇళయరాజా విషయంలో నన్ను చాలా తప్పు పట్టారు
-
దేవుడి కోసమే పుట్టి అంత చిన్న వయసులోనే చనిపోయారు
-
సింగర్ సుశీల గారిని చాలా వేదన పెట్టాను.
-
ప్రముఖ గాయని పి.సుశీల మనవరాలి నిశ్చితార్థ వేడుక
సాక్షి, బంజారాహిల్స్: ప్రముఖ గాయని పద్మభూషణ్ డాక్టర్ పి.సుశీల మనవరాలి వివాహ నిశ్చితార్థ వేడుక మంగళవారం శంషాబాద్‌లోని సియారా రిట్రీట్‌లో ఘనంగా జరిగింది. గాయని పి.సుశీల కుమారుడు జయకృష్ణ, సంధ్య దంపతులు గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె శుభశ్రీకి బంజారాహిల్స్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీరామ్, రాధిక దంపతుల కుమారుడు వినీత్‌తో నిశ్చాతార్థం జరిగింది. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు వేడుకలో పాల్గొన్నారు. చదవండి: Bappi Lahiri Death: ప్రముఖ గాయకుడు బప్పి లహిరి కన్నుమూత -
నేను క్షేమంగానే ఉన్నా: పి.సుశీల
సాక్షి, తమిళసినిమా(చెన్నై): ప్రఖ్యాత గాయని పి.సుశీల మరణించారం టూ వాట్సాప్‌లో ఓ ఆకతాయి దుష్ప్రచారం చేయడంతో.. తాను బతికే ఉన్నానని చెప్పుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. వాట్సాప్‌లో వచ్చిన పోస్టింగ్‌లో నిజం లేదనీ, అది వట్టి వదంతేనంటూ ఓ సెల్ఫీ వీడియోను శుక్రవారం తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్ చేశారు. -
నేను బతికే ఉన్నా: సింగర్ సుశీల
-
నేను బతికే ఉన్నా: సింగర్ సుశీల
సాక్షి, సినిమా : లెజెండరీ గాయని పీ సుశీల క్షేమంగా ఉన్నారు. ఆరోగ్యం క్షీణించటంతో గురువారం రాత్రి ఆమె చనిపోయారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయ్యింది. దీంతో పలువురు నివాళులర్పిస్తూ తమ సంతాపం తెలియజేశారు. ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న ఆమె ఓ వీడియో సందేశంలో తాను పూర్తి ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను అమెరికా పర్యటనలో ఉన్నానని.. శనివారం తిరిగి ఇండియాకు వస్తానని ఆమె అందులో చెప్పారు. మరోవైపు కోలీవుడ్‌కు చెందిన పబ్లిక్ రిలేషన్ అధికారిణి రియాజ్ అహ్మద్ కూడా ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందంటూ ఓ ఫోటోను తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆమె డల్లాస్‌లో ఉన్నట్లు ఆయన తెలియజేశారు. 81 ఏళ్ల సుశీల దక్షిణా భాషలతోపాటు హిందీ, సింహళంలో కూడా పాటలు పాడిన విషయం తెలిసిందే. -
గాయని సుశీలకు బాబు అభినందనలు
సాక్షి, హైదరాబాద్: గిన్నిస్ రికార్డ్ సాధించిన ప్రముఖ గాయని పి.సుశీలకు సీఎం చంద్రబాబునాయుడు బుధవారం అభినందనలు తెలిపారు. ఆరు భాషల్లో 17 వేలకు పైగా పాటలు పాడటం సుశీలకే సాధ్యమైందని, ఆమె తెలుగు వారవడం గర్వకారణమని అన్నారు. కాగా, అమరావతిలో అంబేడ్కర్ స్మృతివనం ఏర్పాటు చేస్తామని ప్రకటించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులు రావెల కిశోర్‌బాబు, పీతల సుజాత, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, పలువురు ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు. -
సుశీలతో లెజెండ్స్