
గాయని సుశీలకు బాబు అభినందనలు
సాక్షి, హైదరాబాద్: గిన్నిస్ రికార్డ్ సాధించిన ప్రముఖ గాయని పి.సుశీలకు సీఎం చంద్రబాబునాయుడు బుధవారం అభినందనలు తెలిపారు. ఆరు భాషల్లో 17 వేలకు పైగా పాటలు పాడటం సుశీలకే సాధ్యమైందని, ఆమె తెలుగు వారవడం గర్వకారణమని అన్నారు. కాగా, అమరావతిలో అంబేడ్కర్ స్మృతివనం ఏర్పాటు చేస్తామని ప్రకటించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులు రావెల కిశోర్‌బాబు, పీతల సుజాత, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, పలువురు ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు.