
సాక్షి, నెల్లూరు (వేదాయపాళెం): మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశ చట్టం తీసుకురావడం ఎంతో శ్లాఘనీయమని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి చట్టం తీసుకువచ్చిన సీఎం జగన్‌కు జేజేలు పలుకుతున్నట్లు చెప్పారు. ఇలాంటి చట్టాన్ని అన్ని రాష్ట్రాలు తీసుకువచ్చి, అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఐటీయూ రాష్ట్ర మహాసభల సందర్భంగా నిర్వహిస్తున్న సాంస్కృతికోత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన ఆదివారం నెల్లూరు వచ్చారు. అక్కడ విలేకర్లతో మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన దిశ ఘటన నేపథ్యంలో 21 రోజుల్లో నేరస్తులను శిక్షించడానికి ఏపీలో దిశ చట్టం తీసుకురావడం గొప్ప విషయమన్నారు.