బాగా ప్రేమిస్తాడు! | Tarun new film launched | Sakshi
Sakshi News home page

బాగా ప్రేమిస్తాడు!

Published Fri, Sep 25 2015 11:38 PM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM

బాగా ప్రేమిస్తాడు!

బాగా ప్రేమిస్తాడు!

 కొంత విరామం తర్వాత తరుణ్ ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. కన్నడంలో ఘనవిజయం సాధించిన ‘సింపులాగి ఒంది లవ్‌స్టోరీ’ చిత్రం రీమేక్‌కు ఆయన పచ్చజెండా ఊపారు. రమేశ్ గోపి దర్శకత్వంలో రామ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అభిరామ్ సమర్పణలో ఎస్.వి. ప్రకాశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం మొదలైంది. హీరో శ్రీకాంత్ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకరత్న దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు.

నిర్మాత డి. సురేశ్‌బాబు గౌరవ దర్శకత్వం వహించారు. తరుణ్ మాట్లాడుతూ - ‘‘ఇందులో మూడు కోణాలున్న పాత్ర నాది. అవుట్ అండ్ అవుట్ లవ్‌స్టోరీ’’ అన్నారు. ‘‘ఒక అమ్మాయిని ఎన్ని సంవత్సరాలు ప్రేమించామన్నది కాదు.. ఎంత బాగా ప్రేమించామన్నదే ముఖ్యం అన్నదే ఈ స్టోరీ లైన్’’ అని దర్శకుడు చెప్పారు. వచ్చే నెల మొదటివారంలో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీనాథ్ విజయ్, మాటలు: వీరబాబు బాసిన, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: వెంకటేశ్. పి, జగదీశ్.
 

Advertisement
Advertisement