జగన్మాత
అమ్మవారి పాత్రల్లో అలవోకగా ఒదిగిపోతారు రమ్యకృష్ణ. అందుకు ఓ ఉదాహరణ ‘అమ్మోరు’ చిత్రం. తాజాగా ‘జగన్మాత’ అనే చిత్రంలో ఆమె అమ్మవారిగా నటించారు. గజ్జరపు మహిమా చౌదరి సమర్పణలో శ్రీ సాయి సీతారామ ప్రొడక్షన్స్ పతాకంపై జక్కంసెట్టి వెంకటేశ్వరరావు, ఎన్.ఎస్. రాజు నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. నండూరి వీరేష్ దర్శకుడు. గ్రాఫిక్స్‌కి ప్రాధాన్యం ఉన్న చిత్రమిదని నిర్మాత తెలిపారు. నవరసభరితంగా సాగే ఈ చిత్రం అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని దర్శకుడు అన్నారు. ఎన్.ఎస్. రాజు, అమిత్, జాకీ, విజయ రంగరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌కిరణ్, కెమెరా: హరినాధరెడ్డి, నాగబాబు, సమర్పణ: గజ్జరపు మహిమా చౌదరి, నిర్మాతలు: జక్కంసెట్టి వెంకటేశ్వరరావు, ఎన్.ఎస్. రాజు.