హీరోయిన్ ఓరియంటెడ్ నేపథ్యంలో ఇప్పటికే చాలా చిత్రాలొచ్చి, దాదాపు విజయవంతమయ్యాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ టైటిల్ రోల్‌లో న్యాచురల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం ‘అంతం లేని కథ’. దాసరి గంగాధర్ దర్శకత్వంలో డాక్టర్ సీఆర్ మనోహర్ ఆశీస్సులతో వసంత్ మూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ జూన్ మొదటి వారంలో ఆరంభం కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఆసక్తికరమైన కథనంతో తెరకెక్కనున్న చిత్రమిది. ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేసే అంశాలెన్నో ఉంటాయి.
కథానాయికగా ఓ ప్రముఖ హీరోయిన్ నటించనున్నారు. దర్శకుడిగా నన్ను నేను నిరూపించుకునే చిత్రమిది’’ అని చెప్పారు. పశుపతి, భానుచందర్, సీత, శరణ్య, హేమ, బాబూమోహన్, తాగుబోతు రమేశ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమాన్.
థ్రిల్లర్ కథాంశంతో...
Published Mon, May 23 2016 10:30 PM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM
Advertisement
Advertisement