నయనకు కోపమొచ్చింది!
నటి నయనతార ప్రభుత్వ అధికారులతో వాగ్వాదానికి దిగారట. ఇదేమిటీ ఆమెకు అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనేగా మీ సందేహం.అగ్ర నాయకిగా రాణిస్తున్న నయనతార ఇంతకు ముందు పక్కా కమర్షియల్ చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపేవారు.అలాంటిది ఇటీవల హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించడంపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం నయన్ న చిత్రాల్లో 90 శాతం ఈ తరహా చిత్రాలే కావడం విశేషం. వాటిలో ఆరం చిత్రం ఒకటి. తాగు నీరు ప్రధానాంశంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార కలెక్టర్‌గా నటిస్తున్నారు.
కుగ్రామాల్లో నీటి సమస్యను, ప్రజల కోరికలను స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కారించే దిశగా ప్రభుత్వ అధికారులతో వాగ్వాదానికి దిగి వారి నిర్లక్ష్య ధోరణిని నిలదీసే సన్నివేశాలు ఈ ఆరం చిత్రంలో చోటు చేసుకుంటాయట. పరమకుడి సమీపంలోని ముత్తుకుళ్లత్తూర్ ప్రాంతాల్లో చిత్రీకరించారు. చిత్రంలో ఈ సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందనే నమ్మకాన్ని చిత్ర వర్గాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి ఏకధాటిగా 50 కాల్‌షీట్స్ కేటాయించి నటించిన నయనతార ఒక మంచి చిత్రంలో నటించాననే సంతృప్తిని వ్యక్తం చేసినట్లు ఆరం చిత్ర వర్గాలు తెలిపారు. ఈ చిత్రం ఆడియే త్వరలో విడుదల కానుందని వారు చెప్పారు.