heroine-oriented
-
ఆ కోరిక తీరనుంది!
వచ్చే అదృష్టాన్ని నిలువరించడం ఎవరితరం కాదు. అలాగే అందని దాని కోసం ఆశ పడడం వృథానే. అలాగని కలల్ని కనడం, వాటిని నెరవేర్చుకోవడానికి కృషి చేయడం సాధికుల లక్షణం. అదే విధంగా అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం తెలివైన వారి పని. ఇక సినీ కథానాయికల విషయానికొస్తే వరించి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఎదిగే వారు కొందరైతే, కోరుకున్న అవకాశాలను సంపాదించుకునే వారు మరి కొందరు. మొదట నుంచి అందాలార బోసి కమర్షియల్ హీరోయినన్ లగా పేరు తెచ్చుకుని నటిగా ఒక స్థాయికి చేరిన తరువాత కథలో సెంటరిక్ పాత్రలను పోషించాలని ఆశ పడుతుండడం సహజం. అయితే ఆశపడిన వారందరికీ అలాంటి అవకాశాలు రావడం అన్నది కల్లే. కొందరికి మాత్రం ఆశించకుండానే హీరోయిన్ ఓరియెంటెడ్ అవకాశాలు ముంగిట వాలతాయి. ఒకప్పుడు నటి విజయశాంతి అలాంటి లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో నటించి లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందారు. తాజాగా నటి నయనతార, అనుష్క, త్రిష లాంటి వారు కథల్లో సెంటరిక్ పాత్రలో రాణిస్తున్నారు. ఇటీవల నటి సోనియా అగర్వాల్ కూడా లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నటిస్తున్నారు. ఆమె నటిస్తున్న అహల్య అనే చిత్రం ఐదు భాషల్లో తెరకెక్కుతోంది. కాగా నటి కాజల్‌అగర్వాల్‌కు కూడా స్త్రీ ప్రధాన పాత్రతో కూడిన చిత్రాల్లో నటించాలన్న ఆశ పుట్టింది. ఇప్పటి వరకూ గ్లామరస్ పాత్రలకే పరిమితవైున ఈ బ్యూటీ కెరీర్ మధ్యలో కాస్త డౌన్ నా మళ్లీ గాడిలో పడింది. ప్రస్తుతం అజిత్‌తో వివేకం చిత్రంలోనూ, విజయ్‌తో ఆయన 61వ చిత్రంలోనూ రొమాన్స్ చేస్తున్న ఈ ఉత్తరాది భామ కోరుకున్నట్లు తాను ఆశపడిన పాత్రలో నటించే అవకాశం వరించిందన్నది తాజా సమాచారం. దర్శకుడు డీకే నయనతార కోసం ఒక హీరోయిన్ సెంటరిక్ కథను తయారు చేసుకున్నారు. ఈ పాత్రలో ఇప్పుడు నటి కాజల్‌అగర్వాల్‌ను ఎంపిక చేసుకున్నారు. కాజల్ ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో కవలైవేండామ్ చిత్రంలో నటించారు. ఆ స్నేహం కారణంగానే ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంలో నటించే అవకాశం కాజల్‌ను వరించిందని తెలుస్తోంది. మొత్తం మీద కాజల్ కోరుకుంది సాధించుకుంది. ఇప్పుడు ఈ అమ్మడు కూడా నయనతార, త్రిషల వరుసలో చేరబోతున్నందుకు ఆనందంలో తేలిపోతోందట. లక్కు అంటే ఇదే మరి. -
నయనకు కోపమొచ్చింది!
నటి నయనతార ప్రభుత్వ అధికారులతో వాగ్వాదానికి దిగారట. ఇదేమిటీ ఆమెకు అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనేగా మీ సందేహం.అగ్ర నాయకిగా రాణిస్తున్న నయనతార ఇంతకు ముందు పక్కా కమర్షియల్ చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపేవారు.అలాంటిది ఇటీవల హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించడంపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం నయన్ న చిత్రాల్లో 90 శాతం ఈ తరహా చిత్రాలే కావడం విశేషం. వాటిలో ఆరం చిత్రం ఒకటి. తాగు నీరు ప్రధానాంశంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార కలెక్టర్‌గా నటిస్తున్నారు. కుగ్రామాల్లో నీటి సమస్యను, ప్రజల కోరికలను స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కారించే దిశగా ప్రభుత్వ అధికారులతో వాగ్వాదానికి దిగి వారి నిర్లక్ష్య ధోరణిని నిలదీసే సన్నివేశాలు ఈ ఆరం చిత్రంలో చోటు చేసుకుంటాయట. పరమకుడి సమీపంలోని ముత్తుకుళ్లత్తూర్ ప్రాంతాల్లో చిత్రీకరించారు. చిత్రంలో ఈ సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందనే నమ్మకాన్ని చిత్ర వర్గాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి ఏకధాటిగా 50 కాల్షీట్స్ కేటాయించి నటించిన నయనతార ఒక మంచి చిత్రంలో నటించాననే సంతృప్తిని వ్యక్తం చేసినట్లు ఆరం చిత్ర వర్గాలు తెలిపారు. ఈ చిత్రం ఆడియే త్వరలో విడుదల కానుందని వారు చెప్పారు. -
థ్రిల్లర్ కథాంశంతో...
హీరోయిన్ ఓరియంటెడ్ నేపథ్యంలో ఇప్పటికే చాలా చిత్రాలొచ్చి, దాదాపు విజయవంతమయ్యాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ టైటిల్ రోల్లో న్యాచురల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం ‘అంతం లేని కథ’. దాసరి గంగాధర్ దర్శకత్వంలో డాక్టర్ సీఆర్ మనోహర్ ఆశీస్సులతో వసంత్ మూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ జూన్ మొదటి వారంలో ఆరంభం కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఆసక్తికరమైన కథనంతో తెరకెక్కనున్న చిత్రమిది. ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేసే అంశాలెన్నో ఉంటాయి. కథానాయికగా ఓ ప్రముఖ హీరోయిన్ నటించనున్నారు. దర్శకుడిగా నన్ను నేను నిరూపించుకునే చిత్రమిది’’ అని చెప్పారు. పశుపతి, భానుచందర్, సీత, శరణ్య, హేమ, బాబూమోహన్, తాగుబోతు రమేశ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమాన్. -
అదో సరికొత్త అనుభవం
క.క.క.పో చిత్రంలో నటించడానికి భయపడ్డానని ఆ చిత్రం కథానాయకి సాక్షీ అగర్వాల్ తెలిపారు.ఈమె నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం ఇది. నవ నటుడు కేశవన్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని డీఎన్ఎస్.ప్రొడక్షన్స్ పతాకంపై సెల్వి శంకరలింగం నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు పీఎస్.విజయ్ పరిచయం అవుతున్నారు.ఈయన వికడన్ పత్రిక సంస్థలో సుదీర్ఘ కాలం పని చేశారన్నది గమనార్హం. విజయ్ కథ,కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ క.క.క.పో చిత్రానికి దినా, పీసీ.శివం,అమర్.సీవీ ముగ్గురు సంగీతాన్ని అందించడం విశేషం. చిత్ర వివరాలను దర్శకుడు పీఎస్.విజయ్ తెలుపుతూ ఇది వినోదమే ప్రధానంగా తెరకెక్కించిన వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రం అని చెప్పారు. ఫాంటసీతో కూడిన చిన్న మ్యాజిక్ కూడా చిత్రంలో ఉంటుందన్నారు. మరో విషయం ఏమిటంటే పవర్‌స్టార్ శ్రీనివాసన్, సింగంపులి,ఎంఎస్.భాస్కర్, కరుణాస్,మదన్‌బాబు, మయిల్సామి,రోబోశంకర్ తదితర 40 మంది హాస్య నటులు నటించిన చిత్రం ఇదని అన్నారు. దీన్ని తెలుగులో కూడా రీమేక్ చేయనున్నట్లు దర్శకుడు తెలిపారు. హీరోలా ఫైట్స్ చేశాను చిత్ర కథానాయకి సాక్షీ అగర్వాల్ మాట్లాడుతూ ఈ చిత్ర కథను దర్శకుడు చెప్పినప్పుడు ఇందులో నటించడానికి చాలా భయపడ్డానని, ఆ తరువాత అమ్మానాన్నలు కథ విని నటించమని ప్రోత్సహించడంతో తాను ధైర్యం చేశానని అన్నారు. చిత్రంలో అంతా వివాదాస్పద విషయం ఉందన్నారు.అయితే దర్శకుడు ఆ సన్నివేశాన్ని ఎలాంటి వివాదాస్పదానికి తావు లేకుండా చిత్రీకరించారని తెలిపారు. సాధారణంగా చిత్రాల్లోహీరోలకు ఇంట్రో సాంగ్ ఉంటుందనీ, అలాంటిది ఈ చిత్రంలో తనకూ ఇంట్రో సాంగ్ ఉంటుందని చెప్పారు.అంతే కాదు చిత్ర తుది ఘట్ట సన్నివేశంలో తాను ఫైట్ చేశానని వెల్లడించారు.మొత్తం మీద ఈ చిత్రంలో నటించడం తనకు సరి కొత్త అనుభం అని సాక్షి పేర్కొన్నారు. ఇది పేమ ఇతివృత్తంతో కూడిన హాస్య భరిత చిత్రం కావడంతో చిత్ర సింగిల్ ట్రాక్ ఆడియోను ఈ నెల 14న విడుదల చేయనున్నట్లు నిర్మాత వెల్లడిం చారు.చిత్రాన్ని మార్చిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.