
హీరో సుశాంత్ తండ్రి కన్నుమూత
హైదరాబాద్ : టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్‌కు పితృవియోగం కలిగింది. అక్కినేని నాగార్జున సోదరి నాగ సుశీల భర్త , హీరో సుశాంత్ తండ్రి అనుమోలు సత్యభూషణ రావు(68) గురువారం ఉదయం మృతి చెందారు. రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. సత్యభూషణ రావు మృతితో సుశాంత్ నివాసంలో విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకొన్న సినీ ప్రముఖులు సుశాంత్ తండ్రి మృతికి సంతాపం ప్రకటించారు. అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ దంపతుల రెండో కుమార్తె నాగ సుశీలను సత్యభూషణ రావు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
సత్య భూషణరావు.. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థ అధిపతి అనుమోలు వెంకటసుబ్బారావు కుమారుడు. సత్యభూషణ రావు మృతితో అక్కినేని ఫ్యామిలీ ఇంట కూడా విషాదం నెలకొంది. సత్యభూషణ రావు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అయితే ఇవాళ (గురువారం) సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగాల్సిన రారండోయ్ వేడుక చూద్దా ఆడియో వేడుకను బావమరిది మరణం కారణంగా నాగార్జున వాయిదా వేసినట్టు సమాచారం.