
నాన్నపై ప్రేమతో హీరో సుశాంత్ ఇలా..
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ తన తండ్రిపై ప్రేమతో చేసిన పోస్ట్ అందరి హృదయాలను కదిలిస్తోంది. రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుశాంత్ తండ్రి అనుమోలు సత్యభూషణ రావు(68) గురువారం ఉదయం మృతిచెందిన విషయం తెలిసిందే. లవ్ యూ నాన్న అంటూ బాధతో తన తండ్రితో అనుభూతులను షేర్ చేసుకున్నారు. ‘ మా నాన్న సత్యభూషణరావు చాలా కామ్‌గా ఉండేవారు. అందరిని నవ్వించేవారు. ప్రేమించేవారు. ఆయన జీవితమంతా కుటుంబం, స్నేహితులతో హాయిగా గడిచిపోయింది.
మరింత ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేందుకు ఆయన ఇక్కడినుంచి సెలవు తీసుకునే సమయం ఇది. ఆయన లేనిలోటు భయానికి గురిచేస్తుంది. మా జీవితంలో విలువైన వ్యక్తిగా ఎన్నో మధుర స్మృతులను అందించి ఆశీర్వదించారు. ఇలాంటి సమయంలో మాకు అండగా ఉన్న అందరికీ ధన్యవాదాలు’ లవ్ యూ నాన్నా అంటూ నాన్నపై ప్రేమను హీరో సుశాంత్ ఇలా వ్యక్తంచేశారు. సుశాంత్ ట్వీట్‌ను పలువురు రీట్వీట్ చేస్తూ ఆయనకు తమ సానుభూతి తెలుపుతున్నారు.