యూత్ అంటే బూతు కాదు | 'Top Rankers' Movie Ready for Release | Sakshi
Sakshi News home page

యూత్ అంటే బూతు కాదు

Published Sun, Feb 16 2014 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 3:44 AM

యూత్ అంటే బూతు కాదు

యూత్ అంటే బూతు కాదు

వైవిధ్యభరితమైన పాత్రలను చేయడానికి ఎప్పుడూ ముందుంటారు డా.రాజేంద్రప్రసాద్. పాత్రలో పూర్తిగా ఒదిగిపోవడానికి తన ఆహార్యాన్ని, శారీరక భాషను మార్చుకుంటారు. అందుకు నిదర్శనంగా మేడమ్, ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి.. ఇలా పలు చిత్రాలను చెప్పుకోవచ్చు. త్వరలో ‘టాప్ ర్యాంకర్స్’ చిత్రంలో రాజేంద్రప్రసాద్ ఓ వినూత్నమైన లుక్‌లో కనిపించబోతున్నారు. విశ్వవిజన్ ఫిలింస్ పతాకంపై కేవీకే రావ్ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ సమర్పణలో పసుపులేటి బ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మించారు. గోళ్లపాటి నాగేశ్వరరావు దర్శకుడు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘విద్యార్థులు, విద్యా సంస్థలు, తల్లిదండ్రులు .. ఈ ముగ్గురి చుట్టూ తిరిగే కథ ఇది.  తెలుగు పరిశ్రమలో ఇప్పటివరకు రాని ఓ కొత్త కథతో ఈ సినిమా చేశాం. యూత్ అంతే బూతు కాదని చెప్పే చిత్రం. జయసూర్య స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement