
జీవితం అనూహ్యం...
అనూహ్య ఘటనల నేపథ్యంలోని చిత్రం ‘కౌసల్య’. శరత్ కల్యాణ్, అభిషేక్ రంజన్, శ్వేతా ఖడే తారలుగా మధుసూధన్ సామల, రమేశ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు మహేశ్ ఆపాల దీనికి స్వరాలు కూడా అందించారు.
టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కాంతారావు పాటలు విడుదల చేశారు. ‘‘జీవితం అనూహ్యమనే కాన్సెప్ట్‌తో యథార్థఘటన ఆధారంగా తీశాం’’ అని దర్శకుడు తెలిపారు. సహనిర్మాతలు: రవీందర్ రెడ్డి చింతకుంట, రవి గుమ్మడిపూడి.