Kaushalya
-
కోటీశ్వరి కౌసల్య
కౌసల్య ‘ప్రత్యేక ప్రతిభావంతురాలు’! ఇప్పుడు కోటీశ్వరి. ప్రపంచంలోనే ఒక గేమ్ షోలో కోటి గెలిచిన తొలి ‘స్పెషల్లీ చాలెంజ్డ్’ మహిళా కంటెస్టెంట్! ఆత్మవిశ్వాసం ఉంటే అంగవైకల్యం అడ్డురాదని చాటిన కౌసల్యా కార్తిక.. మాట్లాడలేరు. వినలేరు. అందుకే ఆమెలా ఆమె సాధించిన విజయం కూడా ప్రత్యేకమైనది. కౌసల్య (31) పుట్టింది, పెరిగింది అంతా తమిళనాడులోని మదురైలో. బియస్సీ టెక్నాలజీ, ఎం.ఎస్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేశారు. ఎంబిఏ కూడా. ఇన్నీ చదివిన కౌసల్య పుట్టు మూగ, చెవుడు. కౌసల్యకు భర్త, ఏడాది పిల్లాడు ఉన్నారు. కౌసల్య మదురై ప్రిన్సిపుల్ సెషన్స్ జడ్జి కోర్టులో జూనియర్ అసిస్టెంట్. చిన్న వయస్సు నుండే తెలివైన పిల్లగా గుర్తింపు తెచ్చుకుంది. ప్లస్ టూ వరకు నాగర్ కోయిల్ లోని బదిరుల పాఠశాలలో చదివింది. ప్రతి క్లాస్‌లోనూ ఫస్ట్ ర్యాంకే. బిఎస్సీ, ఎం.ఎస్సీ, ఎంబిఏలో కూడా గోల్డ్ మెడలిస్ట్. కౌసల్యకు రెండు కలలు ఉండేవి. మొదటిది తాను చదివిన బదిరుల పాఠశాలకు సాయం చేయాలి. రెండోది ఇటలీ లేదా స్విట్జర్లాండ్ పర్యటన చేయాలి. ఈ రెండు కలలతో పాటు.. ఆత్మ విశ్వాసం ఇప్పుడు ఆమెను ‘కోటీశ్వరి’ని చేసింది. కలర్స్ చానెల్ వాళ్లు తమిళంలో మహిళల కోసం ప్రత్యేకంగా గత ఏడాది డిసెంబరు 23న ‘కోటీశ్వరి’ అనే గేమ్ షో ప్రారంభించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఆ షో ప్రసారం అవుతోంది. సీనియర్ నటి రాధిక అనుసంధానకర్తగా వ్యవరిస్తున్నారు. ఈ ‘షో’లోనే కౌసల్య కోటి రూపాయలు సాధించారు. రాధిక అడిగిన ప్రశ్నలను లిప్ రీడింగ్ ద్వారా అర్థం చేసుకుని సమాధానాలను అందించిన కౌసల్య.. సుదీర్ఘంగా జరిగిన గేమ్‌లో కోటి రూపాయల బహుమతి సాధించారు. షో మొదటి సీజన్లోనే కోటిరూపాయల ప్రైజ్ మనీ పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ప్రత్యేక ప్రతిభావంతురాలి’గా కౌసల్య నిలిచారు. కోటిరూపాయల ఫైనల్ ఎపిసోడ్ జనవరి 21 రాత్రి 8 గంటలకు కలర్స్ తమిళ్ చానెల్లో ప్రసారం అయింది. ‘‘ఈ షో ద్వారా నా రెండు కలలు నిజం కాబోతున్నాయి’’ అంటూ కౌసల్య ఆనందం వ్యక్తం చేశారు. ఇటువంటి ఒక ప్రత్యేక ప్రతిభావంతురాలు కౌసల్యను ప్రపంచం చూడటం ఇదే మొదటిసారి అని రాధిక అభినందనల వర్షం కురిపించారు. – సంజయ్ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధి, సాక్షి టీవీ, చెన్నై -
పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
స్టేషన్‌ఘన్‌పూర్ మండలం క్రిష్ణాజీగూడెం గ్రామంలో విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన చెందిన పోలు కౌసల్య(48) అనే మహిళ ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
టీఆర్ఎస్ సర్పంచ్ మృతి
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం గడ్డికొండారం గ్రామ టీఆర్ఎస్ సర్పంచ్ కౌసల్య (55) అనారోగ్యంతో మంగళవారం మధ్యాహ్నం మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నల్లగొండలోని శాంతినగర్‌లో తన నివాసంలో కొంత కాలంగా చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. -
భారత మహిళల జట్టుకు రెండో విజయం
బెంగళూరు: మహిళల టి20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 4 వికెట్లకు 125 పరుగులు చేసింది. సురంగిక (43 నాటౌట్), కౌసల్య (34 నాటౌట్), జయాంగి (18) మెరుగ్గా ఆడారు. తర్వాత భారత్ 17.5 ఓవర్లలో 2 వికెట్లకు 128 పరుగులు సాధించింది. స్మృతి మందన (42 నాటౌట్), వనిత (37), మిథాలీ రాజ్ (23), హర్మన్‌ప్రీత్ కౌర్ (12 నాటౌట్) రాణించారు. -
ఉత్తమ సంస్కారం... కట్టుబడి ఉండటం
శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్లిపోతున్నాడు. కౌసల్య పిలిచి చెప్పింది.. ‘‘ఎందుకు ఈ అరణ్యవాసం? నా మాట విను’’ దానికి రాముడన్నాడు కదా.. ‘‘నాకు ధర్మం కావాలమ్మా, నాన్నగారు చెప్పిన మాటను నిజం చేస్తాను. అందుకని వెళ్లిపోతాను’’ అన్నాడు. అప్పుడు కౌసల్య ఒక మాట చెప్పింది. పెద్దలు ఇప్పటికీ ఒక మాటంటూంటారు. అమ్మ కట్టిచ్చిన చద్దన్నపు మూట అంటారు. ఒక వ్యక్తి జీవితాన్ని బాగా ప్రభావితం చేసేది ఎవరంటే తల్లి. తల్లి చెప్పిన ఒక మంచిమాట, తల్లి చేతిలో వేయించుకున్న ఒట్టు నిర్ణయం చేసేస్తుంది. కౌసల్య అన్నది... ‘‘రామా! నీవు ధర్మం ధర్మం అని దేనినైతే పట్టుకున్నావో అది వదిలిపెట్టకు. ఆ భావన, ఆ విశ్వాసం నీకు ధర్మంపట్ల నిలబడుగాక. ఎంతకష్టమొచ్చినా ధార్మిక మార్గంలోనే నీవు బతికెదవుగాక. అలా బతకడం నేర్చుకో. నీ ధర్మం అలా నిలబెట్టుకోవడం నేర్చుకో’’అంది. తర్వాత రాముడు అరణ్యవాసానికి వెళ్లాడు. వాలితో స్నేహం చేస్తే సీతమ్మను ఉత్తరక్షణంలో బయటికి తీసుకువస్తాడు. కానీ ధర్మం లేనివాడితో నాకు స్నేహమెందుకని, ధార్మికుడైన సుగ్రీవుడితో స్నేహం చేశాడు. దానితో చాలా కష్టపడాల్సి వచ్చింది. సముద్రానికి సేతువు కట్టారు. హనుమ వెళ్లాడు. యుద్ధం, తర్వాత రావణాసురుడిపై గెలిచాడు. సీతమ్మను తెచ్చుకున్నాడు. అలా కాక రాముడు ధర్మాన్ని వదిలిపెట్టి ఉంటే, అమ్మకు ఇచ్చిన మాట మరచిపోయి ఉండి ఉంటే... ఇప్పుడు కలియుగంలో ఆయన పూజింపబడి ఉండేవాడా? ఒక్కసారి కమిట్ అయితే... మహమ్మదీయ సంప్రదాయంలో ఒక కథ ప్రచారంలో ఉంది. అప్ఘానిస్థాన్లో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు షేక్ అబ్దుల్ ఉల్ జిలానీ. చిన్నతనంలో ఆవులు, మేకలు కాస్తుండేవాడు. ఒక రోజున అలా వెళ్లిన సమయంలో ఒక ఆవు అన్నది కదా... ‘‘మనిషివై పుట్టినందుకు ఆవుల్ని, మేకల్ని కాయడం కాదు, జ్ఞానాన్ని సంపాదించు’’ అన్నది. ఆయన ఇంటికి తిరిగొచ్చి పైకప్పుమీదికెక్కి చుట్టూ చూశాడు. ఇరాక్ వెడుతున్న ఒక గుంపు కనబడింది. వెంటనే వాళ్ల అమ్మ దగ్గరకు వెళ్లి ‘‘జ్ఞానం తెలుసుకోవడానికి ఇరాక్‌కు మతపెద్దల దగ్గరికి వెడుతున్నా’’ అన్నాడు. తల్లి ‘ఆగు’ అని లోపలకు వెళ్లి 40 బంగారు కాసులు తీసుకువచ్చింది. ‘‘ఇది మీ నాన్న ఆస్తిలో నీ వాటా. నీ గురువు దగ్గర జ్ఞానాన్ని పొంది భగవంతుడిని చేరుకో. ఈ బంగారు కాసులన్నీ పైకి కనబడకుండా కోటు లోపల దారం పెట్టి కుట్టేస్తున్నా’’ అని కుట్టేసింది. వెళ్లబోతుంటే పిలిచి ‘‘ఒక్కమాట ఇవ్వు’’ అన్నది. ‘‘చెప్పమ్మా, నీ మాట నేనెన్నడూ మర్చిపోను’’ అని ఒట్టేశాడు. ‘‘ప్రాణమే పోయినా అబద్ధం చెప్పనని మాట ఇవ్వు’’ అన్నది. ‘‘తప్పకుండా’’ అని ఒట్టేసి వెళ్లిపోయాడు. గుంపుతో కలసి వెడుతుంటే, దారిదొంగలు అడ్డగించి అందరినీ దోచుకుంటూ చిన్న కోటేసుకుని వెడుతున్న ఈ పిల్లవాడి దగ్గరకొచ్చారు. ‘‘నీ దగ్గర ఏమైనా ఉన్నాయా’’ అని అడిగారు వాళ్లు. నా దగ్గర 40 బంగారు కాసులున్నాయి. మా అమ్మ కోటు లోపల పెట్టి కుట్టేసింది’’ అన్నాడు. వాళ్లు పకాపకా నవ్వి పిల్లాడు మనతోనే అబద్ధాలాడుతున్నాడని వాడిని దొంగల నాయకుడి దగ్గరికి తీసుకెళ్లారు. ‘‘అయ్యా! అందరినీ దోచుకుంటేనే ఐదారు కాసుల కన్నా ఎక్కువ దొరకలేదు, వీడినడిగితే 40 కాసులున్నాయంటున్నాడు. మాకు నవ్వొచ్చింది. అందుకే వెంటబెట్టుకొచ్చాం’’ అని చెప్పారు. దొంగల నాయకుడు అడిగితే ‘‘40 కాసులున్నాయి. నీవు జేబులో చెయ్యిపెట్టి వెతికితే దొరకవు. మా అమ్మ లోపలపెట్టి కుట్టేసింది’’ అన్నాడు. నాయకుడు కూడా నమ్మకపోయినా కోటువిప్పి వెతకండని అనుచరులకు పురమాయించాడు. లోపల విప్పి చూస్తే 40 కాసులు కనిపించాయి. దొంగల నాయకుడు విస్తుపోయి, ‘‘అదేమిట్రా అలా ఎందుకు చెప్పావు, 40 బంగారు కాసులున్నాయని! అవి దొరకకూడదనే కదా మీ అమ్మ అలా కుట్టిచ్చింది’’ అని అడిగాడు. దానికి ఆ పిల్లవాడు ‘‘ప్రాణమే పోయినా అబద్ధం చెప్పనని మా అమ్మకు మాటిచ్చాను. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కన్నా అబద్ధం చెప్పి కాసులు దక్కించుకోవడం నాకు గొప్ప విషయం కాదు’’ అన్నాడు. అది విన్న నాయకుడి కంట నీరు కారింది. ‘‘నీకున్న భయం నేను నా తల్లిపట్ల, నా తండ్రిపట్ల, నా పెద్దలపట్ల ఉంచుకుని ఉండి ఉంటే నిర్భయత్వం అన్న పేరుతో కొన్ని వేలమందిని హింసించేవాడిని కాదు. ఇప్పుడర్థమైంది నిజమైన భయం కలిగి ఉండడం అంటే... నేనూ నీతోపాటే వస్తున్నా’’ అని చెప్పి తన గుంపునంతటినీ తీసుకుని అతని వెంట వెళ్లిపోయాడు. తరువాత అతనో ప్రవక్తయ్యాడు. -
స్కూల్‌బస్సు ఢీకొని చిన్నారి మృతి
వేగంగా వెళ్తున్న స్కూలు బస్సు రోడ్డు దాటుతున్న చిన్నారిని ఢీకొట్టిన ఘటనలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం తునికల్లతండాలో శనివారం చోటుచేసుకుంది. తండాకు చెందిన ఏడాదిన్నర వయసున్న చిన్నారి కౌసల్య రోడ్డు దాటుతున్న సమయంలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు ఢీకొట్టడంతో.. బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో గ్రామస్థులు చిన్నారి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విషాహారం తిని ఒకరు మృతి
విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుణానపురంలో కలుషిత ఆహారం తినటం వల్ల ఒకరు మృతి చెందగా.. ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. కర్రి జగన్నాథం, ఆయన భార్య కౌసల్య, మనవడు గోపీచందర్ ఆదివారం మధ్యాహ్నం తోత (రాగి సంగటి) తిన్నారు. ఆ తర్వాత జగన్నాథం మృతి చెందగా, మిగతా ఇద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సిఫారసు చేశారు. -
జీవితం అనూహ్యం...
అనూహ్య ఘటనల నేపథ్యంలోని చిత్రం ‘కౌసల్య’. శరత్ కల్యాణ్, అభిషేక్ రంజన్, శ్వేతా ఖడే తారలుగా మధుసూధన్ సామల, రమేశ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు మహేశ్ ఆపాల దీనికి స్వరాలు కూడా అందించారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కాంతారావు పాటలు విడుదల చేశారు. ‘‘జీవితం అనూహ్యమనే కాన్సెప్ట్‌తో యథార్థఘటన ఆధారంగా తీశాం’’ అని దర్శకుడు తెలిపారు. సహనిర్మాతలు: రవీందర్ రెడ్డి చింతకుంట, రవి గుమ్మడిపూడి. -
అసలు ఎవరీ ‘కౌసల్య’?
యథార్థ సంఘటనల నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రం ‘కౌసల్య’. జనని క్రియేషన్స్ పతాకంపై శరత్ కల్యాణ్, అభిషేక్ రంజన్, శ్వేతా ఖడే ముఖ్యతారలుగా మధుసూదన్ సామల, రమేశ్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ ఆపాల దర్శకుడు. నిర్మాతలు మాట్లాడుతూ, ‘‘కర్ణాటకలో, హైదరా బాద్‌లో షూటింగ్ చేశాం. ఐటమ్ సాంగ్‌తో పాటు యాక్షన్ సీన్స్ తీశాం. అసలు కౌసల్య ఎవరో ఏంటో మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ నెలలో పాటలు, ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బాపూజీ, ఎడిటింగ్: జానకీరామ్, సహనిర్మా తలు: రవీందర్‌రెడ్డి చింతకుంట, రవిగుమ్మడి పూడి. -
మానవేతిహాసమే రామాయణం
‘ర’ అంటే కాంతి. ‘మ’ అంటే నేను అని అర్థం. రామ అంటే ‘నా లోపలి వెలుగు’ అని భావం. రాముడి తలిదండ్రులు కౌసల్య, దశరథులు. దశరథ అంటే పది రథాలు. ఈ పది రథాలూ మన పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలనూ సూచిస్తాయి. కౌసల్య అంటే నైపుణ్యం (కుశలత). అయోధ్య అంటే హింసలేని సమాజం అని అర్థం. మీ లోపల ఏం జరుగుతోందో మీరు కుశలతతో గమనిస్తే మీలో జ్ఞానకాంతి ఉదయిస్తుంది. అదే ధ్యానం. మానసిక ఒత్తిడినుంచి విశ్రాంతి పొందేందుకు మీకు కొంత నైపుణ్యం కావాలి. మీ లోపల వెలుగు ఉదయించినప్పుడు మీరే రాముడు. మనసు లేదా బుద్ధి సీతకు చిహ్నం. సీత రావణుని చేత అంటే బుద్ధి అహంకారం చేత అపహరింపబడింది. రావణునికి పది తలలు. రావణుడు (అహంకారం) తన తలలలో అంటే అహంకారపు ఆలోచనలలో చిక్కుకుపోయి ఉన్నాడు. హనుమ అంటే శ్వాస. హనుమంతుని (శ్వాస) సహాయంతో సీత (బుద్ధి) తిరిగి రాముని వద్దకు (మూలానికి) చేరుకోగలిగింది. అంటే రామాయణం ఒక మానవేతిహాసం. జర్మనీలోని రామ్‌బాగ్, ఇటలీలోని రోమ్ పట్టణాల పేర్లకు మూలం రామ శబ్దమే. ఇండోనేసియా, బాలి, జపాన్ వంటి దేశాలు రామాయణ ప్రభావానికి లోనైనాయి. - శ్రీ శ్రీ రవిశంకర్, వ్యవస్థాపకులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ -
పింఛన్ బెంగతో ముగ్గురు మృతి
కరీంనగర్: పింఛన్ బెంగతో శుక్రవారం ముగ్గురు చనిపోయారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన వొడ్నాల కౌసల్య (63)కు పింఛన్ నిలిచిపోయింది. రేషన్ సరుకులూ రాకపోవడంతో గుండెపోటుకు గురైంది. సైదాపూర్ మండలం గుండ్లపల్లికి చెందిన బీర్‌మహ్మద్(70) పింఛన్ జాబితాలో పేరు లేదన్న మనస్తాపంతో మృతి చెందాడు. గంభీరావుపేటకు చెందిన చంద్రవ్వ(70) పింఛన్ రాదేమోనన్న బెంగతో గుండెపోటుకు గురైంది. -
‘అమ్మా’నుషం
ముగ్గురు చిన్నారులను చంపి.. ఆత్మహత్యకు యత్నించిన తల్లి బాలానగర్: ఓ తల్లి తన ముగ్గురు చిన్నారులను చంపేసి, తానూ ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం గంగాధర్‌పల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భిక్షపతి, కౌసల్య దంపతులు భిక్షాటన చేసి జీవనం సాగిస్తున్నారు. వారికిఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే సోమవారం రాత్రి కౌసల్యతో ఆమె అత్త, ఆడబిడ్డ ఘర్షణ పడ్డారు. తిరిగి మంగళవారం ఉదయం కూడా వారు గొడవకు దిగారు. దీంతో మనస్తాపం చెందిన కౌలస్య తన పిల్లలతో పాటు తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఉదయం చెన్నమ్మ (05), కుమార్ (03)ను ఉరివేసి, జ్యోతి (01)ని గొంతు పిసికి చంపేసింది. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి చెరువు వద్దకు పరుగెడుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఆమె బతికి బయటపడింది. ఈ సంఘటనపై కౌసల్య మాట్లాడుతూ తన అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధిస్తుండడం వల్లే ఈ దారుణానికి ఒడి గట్టినట్లు తెలిపింది. -
ఆగస్ట్ 16న ‘సౌత్ మిర్చి మ్యూజిక్ అవార్డ్స్-2013
-
గాల్లో తేలినట్టుందే...
యువతరం మనోభావాలకు దగ్గరగా ఉండే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘గాల్లో తేలినట్టుందే’. అజయ్‌వర్మ, కౌశల్య, మోనీషా ప్రధాన పాత్రధారులు. వెంకటసురేష్ గుణ్ణం దర్శకుడు. సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, చొక్కాకుల వెంకట్రావ్ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ జరుపుకుంటోంది. వినోదాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఉంటాయని దర్శకుడు చెప్పారు. నిర్మాతల్లో ఒకరైన వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ-‘‘‘సోలో’ తర్వాత మా సంస్థ నుంచి వస్తున్న సినిమా ఇది. తొలి సినిమా మాదిరిగానే ఇది కూడా క్లీన్ ఎంటర్టైనర్. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నెల మూడోవారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శీలం లక్ష్మణ్, సహ నిర్మాత: భాస్కర్ విల్లూరి.