బెంగళూరు: మహిళల టి20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 4 వికెట్లకు 125 పరుగులు చేసింది. సురంగిక (43 నాటౌట్), కౌసల్య (34 నాటౌట్), జయాంగి (18) మెరుగ్గా ఆడారు. తర్వాత భారత్ 17.5 ఓవర్లలో 2 వికెట్లకు 128 పరుగులు సాధించింది. స్మృతి మందన (42 నాటౌట్), వనిత (37), మిథాలీ రాజ్ (23), హర్మన్‌ప్రీత్ కౌర్ (12 నాటౌట్) రాణించారు.
భారత మహిళల జట్టుకు రెండో విజయం
Published Sun, Mar 13 2016 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM
Advertisement
Advertisement