గాల్లో తేలినట్టుందే...
గాల్లో తేలినట్టుందే...
Published Fri, Jan 3 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
యువతరం మనోభావాలకు దగ్గరగా ఉండే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘గాల్లో తేలినట్టుందే’. అజయ్‌వర్మ, కౌశల్య, మోనీషా ప్రధాన పాత్రధారులు. వెంకటసురేష్ గుణ్ణం దర్శకుడు. సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, చొక్కాకుల వెంకట్రావ్ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ జరుపుకుంటోంది. వినోదాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఉంటాయని దర్శకుడు చెప్పారు. నిర్మాతల్లో ఒకరైన వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ-‘‘‘సోలో’ తర్వాత మా సంస్థ నుంచి వస్తున్న సినిమా ఇది. తొలి సినిమా మాదిరిగానే ఇది కూడా క్లీన్ ఎంటర్‌టైనర్. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నెల మూడోవారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శీలం లక్ష్మణ్, సహ నిర్మాత: భాస్కర్ విల్లూరి.
Advertisement
Advertisement