అసలు ఎవరీ ‘కౌసల్య’? | who this Kaushalya | Sakshi
Sakshi News home page

అసలు ఎవరీ ‘కౌసల్య’?

Published Wed, Jul 1 2015 11:00 PM | Last Updated on Mon, Aug 20 2018 2:14 PM

అసలు ఎవరీ ‘కౌసల్య’? - Sakshi

అసలు ఎవరీ ‘కౌసల్య’?

యథార్థ సంఘటనల నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రం ‘కౌసల్య’. జనని క్రియేషన్స్ పతాకంపై శరత్ కల్యాణ్, అభిషేక్ రంజన్, శ్వేతా ఖడే ముఖ్యతారలుగా మధుసూదన్ సామల, రమేశ్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ ఆపాల దర్శకుడు. నిర్మాతలు మాట్లాడుతూ, ‘‘కర్ణాటకలో, హైదరా బాద్‌లో షూటింగ్ చేశాం. ఐటమ్ సాంగ్‌తో పాటు యాక్షన్ సీన్స్ తీశాం. అసలు కౌసల్య ఎవరో ఏంటో మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ నెలలో పాటలు, ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బాపూజీ, ఎడిటింగ్: జానకీరామ్, సహనిర్మా తలు: రవీందర్‌రెడ్డి చింతకుంట, రవిగుమ్మడి పూడి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement