వీధిక్కు వందు పోరాడు టైటిల్‌ ఆవిష్కరణ | Veedhikku Vandhu Poradu title release today | Sakshi
Sakshi News home page

వీధిక్కు వందు పోరాడు టైటిల్‌ ఆవిష్కరణ

Published Tue, Jul 18 2017 2:10 AM | Last Updated on Tue, Sep 5 2017 4:15 PM

వీధిక్కు వందు పోరాడు టైటిల్‌ ఆవిష్కరణ

వీధిక్కు వందు పోరాడు టైటిల్‌ ఆవిష్కరణ

తమిళసినిమా:  వీధిక్కు వందు పోరాడు పేరుతో చిత్రం తెరకెక్కుతోంది. వీ.పీపుల్‌ పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా విక్కీ వైద్యనాథన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్ర వివరాలను ఈయన తెలుపుతూ మన దేశ పరిస్థితిని ఆవిష్కరించే చిత్రంగా వీధిక్కు వందు పోరా డు చిత్రం ఉంటుందన్నారు. దేశంలో ప్రస్తుతం నిత్యం ఎన్నో సమస్యలు మరెన్నో పోరాటాలుగా పరిస్థితి నెలకొందన్నారు.

అయితే సమస్యలను ఎదిరించి పోరాడటానికి చాలా మంది భయపడుతున్నారన్నారు. అలాగైతే సమస్యలకు పరిష్కారం లభించడం కష్టం అని చేప్పే చిత్రంగా వీధిక్కు వందు పోరాడు ఉంటుందన్నారు. దీనికి వీ.మురళీశ్రీధర్‌ చాయాగ్రహణం, వసంత్‌రాజ్‌ సంగీతం అందిస్తున్నారని చెప్పారు. చిత్ర టైటిల్‌ను సోమవారం వీరం, వేదాళం, వివేగం చిత్రాల చాయాగ్రహకుడు వెట్ట్రి ఆవిష్కరించినట్లు దర్శకుడు విక్కీవైద్యనాథన్‌ తెలిపారు. ఈ చిత్రానికి శక్తిసవరణన్‌ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement