సరికొత్త అనుభూతినిచ్చే 8తూట్టాగళ్ | 8 tuttagal will give new thrill | Sakshi
Sakshi News home page

సరికొత్త అనుభూతినిచ్చే 8తూట్టాగళ్

Published Sat, Nov 26 2016 2:36 AM | Last Updated on Sat, Mar 23 2019 9:28 PM

సరికొత్త అనుభూతినిచ్చే 8తూట్టాగళ్ - Sakshi

సరికొత్త అనుభూతినిచ్చే 8తూట్టాగళ్

8 తూట్టాగళ్ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని ఆ చిత్ర దర్శకుడు శ్రీగణేశ్ అంటున్నారు. ఈయన దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని వెట్రివేల్ శరవణా సినిమాస్ పతాకంపై ఎన్.వెళ్లయపాండియన్ నిర్మిస్తున్నారు. దీనికి సహ నిర్మాతగా బిగ్ ప్రింట్ పిక్చర్స్ సంస్థ అధినేత ఐబీ. కార్తికేయన్ వ్యవహరిస్తున్నారు. నవ నటుడు వెట్రి హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా మలయాళ చిత్రం మహేషిందే, ‘ప్రతీకారం’ నాయకి అపర్ణా బాలమురళి నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో నాజర్, ఎంఎస్.భాస్కర్, అమ్మా క్రియేషన్‌‌స శివ, మైమ్ గోపి, మీరా మిథున్ నటిస్తున్నారు.

కేఎస్.సుందరమూర్తి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ 8 తూట్టాగళ్ చిత్రానికి తమ టీమ్ ఎంతో ఉత్సాహంతో పనిచేయడంతో.. ప్రణాళిక ప్రకారం చిత్రీకరణను పూర్తి చేయగలిగామన్నారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించే విధంగా 8 తూట్టాగళ్ చిత్రాన్ని రూపొందించామని, ఇక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న నిర్మాణాంతర కార్యక్రమాలు చిత్రాన్ని మరింత మెరుగుపరుస్తాయని దర్శకుడు శ్రీగణేశ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement