Vetri
-
జీవీ– 2 చిత్ర కథను రెండు రోజుల్లో రాశా..!
సాక్షి, తమిళనాడు: జీవీ– 2 చిత్ర కథను రెండు రోజుల్లో రాసినట్లు దర్శకుడు వీజే గోపీనాథ్ తెలిపారు. ఈయన దర్శకత్వంలో నటుడు వెట్రి హీరోగా నటించిన జీవీ చిత్రం 2019లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. తాజాగా దీనికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రమే జీవీ –2. ఇటీవల శింబు కథానాయకుడిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో మానాడు వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత సురేష్ కామాక్షి తన వీ హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. (చదవండి: నా కెరీర్లో బెస్ట్ పాత్ర ఇదే!: మెహరీన్) దర్శకుడు మాట్లాడుతూ జీవీ చిత్రానికి కథ, సంభాషణలు రచయిత బాబు తమిళ్ రాశారని చెప్పారు. దానికి సీక్వెల్ చేయాలని భావించినప్పుడు రచయిత బాబు తమిళ్‌ను సంప్రదించగా జీవీ చిత్రానికి సీక్వెల్ అవకాశమే లేదని చెప్పడంతో తానే కథను తయారు చేయడానికి సిద్ధమయ్యానన్నారు. అలా రెండు రోజుల్లోనే జీవీ– 2 చిత్ర కథను రాశానని తెలిపారు. చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని తెలిపారు. నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. -
‘వెట్రిని కొత్త చిత్రం మరో స్థాయికి తీసుకెళ్తుంది’
యువ నటుడు వెట్రి కొత్త చిత్రానికి సిద్ధమవుతున్నారు. 8 తూట్టాగల్ చిత్రంతో కథానాయకుడిగా రంగప్రవేశం చేసిన ఈయన ఆ చిత్ర విజయంతో వరుసగా కథాబలం ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. తాజాగా పిక్చర్ బాక్స్ కంపెనీ నిర్మిస్తున్న చిత్రంలో హీరోగా నటించడానికి సిద్ధమయ్యారు. ఈ సంస్థ ఇంతకుముందు పలు చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేసింది. ఈ చిత్రం ద్వారా శ్యామ్మనోహరన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈయన ఇంతకుముందు పలు వాణిజ్య ప్రకటనలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గురించి నిర్మాత అలెగ్జాండర్ మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న అనుభవంతో ప్రేక్షకుల అభిరుచిని కొంతవరకు గ్రహించానన్నారు. దర్శకుడు శ్యామ్మనోహరన్ చెప్పిన కథ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందనిపించిందన్నారు. చిత్ర కథ, కథనాలు కొత్తగా ఉంటాయన్నారు. మిస్టరీ కథా చిత్రాల్లో చివరి సమావేశాలు ఉత్కంఠ భరితంగా ఉంటాయన్నారు. అయితే ఈ చిత్రం ఆది నుంచి చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగుతుందని తెలిపారు. చాలా తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు వెట్రిని ఈ చిత్రం మరో స్థాయికి తీసుకెళ్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కథానాయిక ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోందని, వేసవి కాలం ముగిసిన తర్వాత చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు నిర్మాత తెలిపారు. చదవండి: కేసీఆర్ బయోపిక్కు ‘తెలంగాణ దేవుడు’ పేరు -
వీధిక్కు వందు పోరాడు టైటిల్ ఆవిష్కరణ
తమిళసినిమా: వీధిక్కు వందు పోరాడు పేరుతో చిత్రం తెరకెక్కుతోంది. వీ.పీపుల్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా విక్కీ వైద్యనాథన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్ర వివరాలను ఈయన తెలుపుతూ మన దేశ పరిస్థితిని ఆవిష్కరించే చిత్రంగా వీధిక్కు వందు పోరా డు చిత్రం ఉంటుందన్నారు. దేశంలో ప్రస్తుతం నిత్యం ఎన్నో సమస్యలు మరెన్నో పోరాటాలుగా పరిస్థితి నెలకొందన్నారు. అయితే సమస్యలను ఎదిరించి పోరాడటానికి చాలా మంది భయపడుతున్నారన్నారు. అలాగైతే సమస్యలకు పరిష్కారం లభించడం కష్టం అని చేప్పే చిత్రంగా వీధిక్కు వందు పోరాడు ఉంటుందన్నారు. దీనికి వీ.మురళీశ్రీధర్ చాయాగ్రహణం, వసంత్‌రాజ్ సంగీతం అందిస్తున్నారని చెప్పారు. చిత్ర టైటిల్‌ను సోమవారం వీరం, వేదాళం, వివేగం చిత్రాల చాయాగ్రహకుడు వెట్ట్రి ఆవిష్కరించినట్లు దర్శకుడు విక్కీవైద్యనాథన్ తెలిపారు. ఈ చిత్రానికి శక్తిసవరణన్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
సరికొత్త అనుభూతినిచ్చే 8తూట్టాగళ్
8 తూట్టాగళ్ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని ఆ చిత్ర దర్శకుడు శ్రీగణేశ్ అంటున్నారు. ఈయన దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని వెట్రివేల్ శరవణా సినిమాస్ పతాకంపై ఎన్.వెళ్లయపాండియన్ నిర్మిస్తున్నారు. దీనికి సహ నిర్మాతగా బిగ్ ప్రింట్ పిక్చర్స్ సంస్థ అధినేత ఐబీ. కార్తికేయన్ వ్యవహరిస్తున్నారు. నవ నటుడు వెట్రి హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా మలయాళ చిత్రం మహేషిందే, ‘ప్రతీకారం’ నాయకి అపర్ణా బాలమురళి నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో నాజర్, ఎంఎస్.భాస్కర్, అమ్మా క్రియేషన్స శివ, మైమ్ గోపి, మీరా మిథున్ నటిస్తున్నారు. కేఎస్.సుందరమూర్తి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ 8 తూట్టాగళ్ చిత్రానికి తమ టీమ్ ఎంతో ఉత్సాహంతో పనిచేయడంతో.. ప్రణాళిక ప్రకారం చిత్రీకరణను పూర్తి చేయగలిగామన్నారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించే విధంగా 8 తూట్టాగళ్ చిత్రాన్ని రూపొందించామని, ఇక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న నిర్మాణాంతర కార్యక్రమాలు చిత్రాన్ని మరింత మెరుగుపరుస్తాయని దర్శకుడు శ్రీగణేశ్ పేర్కొన్నారు.