హాస్పటల్లో చేరిన విద్యాబాలన్ | Vidya Balan might be out of hospital on New Year's Day | Sakshi

హాస్పటల్లో చేరిన విద్యాబాలన్

Dec 31 2015 2:52 PM | Updated on Sep 3 2017 2:53 PM

హాస్పటల్లో చేరిన విద్యాబాలన్

హాస్పటల్లో చేరిన విద్యాబాలన్

బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ఆస్పత్రిలో చేరింది. కిడ్నీ సంబంధింత సమస్యతో ఆమె ముంబయిలోని హిందుజా ఆస్పత్రిలో..

ముంబయి: బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ఆస్పత్రిలో చేరింది. కిడ్నీ సంబంధింత సమస్యతో ఆమె ముంబయిలోని హిందుజా ఆస్పత్రిలో చేరగా,  పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు వైద్యులు నిర్దారించారు. ఈ విషయంపై ఆమె సన్నిహితులు స్పందిస్తూ... 'విద్యాబాలన్ కోలుకుంటోంది. ప్రస్తుతం  ఆమె ఆరోగ్యం బాగానే ఉంది. బహుశా విద్యాని శనివారం డిశ్చార్జ్ చేయవచ్చు' అని  తెలిపారు. కాగా విద్యాబాలన్ న్యూ ఇయర్ వేడుకలతో పాటు, తన పుట్టినరోజును భర్త సిద్ధార్థ రాయ్ కపూర్తో కలిసి అబ్రాడ్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసింది. అయితే విద్యాబాలన్ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆ టూర్ను అర్థాంతరంగా క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement