
'పులి' కోసం పాట పాడిన విజయ్
చెన్నై: తమిళనటుడు విజయ్ మరోసారి గొంతు సవరించుకున్నాడు. తన చిత్రం 'పులి' కోసం పాట పాడాడు. తన గత చిత్రాలు తుపాకీ, తలైవాల్లోనూ పాటలు పాడాడు. 'పులి సినిమా కోసం విజయ్ పాడిన పాట రికార్డింగ్ పూర్తైంది. ఈ పాట చాలా బాగా వచ్చింది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, దర్శకుడు శింబుదేవన్ కోరిక మేరకు విజయ్ పాట పాడాడు' అని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
ఈ పాటను వైరముత్తు రాశారు. ఫాంటసీ డ్రామాతో రూపొందుతున్న 'పులి' సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. విజయ సరసన శృతి హాసన్, హన్సిక నటిస్తున్నారు. సీనియర్ నటి శ్రీదేవి, కన్నడ నటుడు సుదీప్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.