
థియేటర్లో తొలిసారి సినిమా చూస్తున్నా!
థియేటర్కు వెళ్లి సినిమా చూడటం అనేది పెద్ద విషయమంటారా? మనలాంటి సామాన్యులకు కాదేమో గానీ, సెలబ్రిటీలకు మాత్రం నిజంగా అది పెద్ద విషయమే. థియేటర్కు వెళ్లారంటే ఒక్కసారిగా అభిమానులు గుమిగూడటం, దాంతో వాళ్లు థియేటర్లకు వెళ్లి సినిమా చూడటం అంటే పెద్ద పండగలాగే భావిస్తారు.
ఇంతకీ విషయం ఏమిటంటే.. శ్రుతిహాసన్ తాను నటించిన 'పులి' సినిమాను చెన్నైలో థియేటర్కు వెళ్లి చూస్తోందట. తాను ఇలా థియేటర్కు వెళ్లి చూడటం ఇదే తొలిసారి అని కూడా ఆమె చెప్పింది. ఈ ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది కమల్ కూతురు.
Watching puli in the theatres for the first time !!!!
All the very best sweetheart 😚😚😚😚 https://t.co/fa7p65qleb
— khushbusundar (@khushsundar) October 1, 2015