మహారాణి పాత్రలు చేయాలంటే పాలనురుగు లాంటి మేని ఛాయ, శిల్పం లాంటి శరీరాకృతి, దొండపండు లాంటి అధరాలు, మీనాల్లాంటి కళ్లు... ఇలా ఆపాదమస్తకం సౌందర్యం ఉట్టిపడాలి. అచ్చంగా శ్రీదేవిలా అన్నమాట. అందుకే, ఫిఫ్టీ ప్లస్ ఏజ్‌లో ఉన్న ఈ జగదేక సుందరిని మహారాణి పాత్రకు తీసుకున్నారు దర్శకుడు శింబుదేవన్. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విజయ్ హీరోగా ఆయన రూపొందిస్తున్న ‘పులి’ చిత్రంలో రాణీ సౌమ్యాదేవిగా శ్రీదేవి నటిస్తున్నారు. దాదాపు పధ్నాలుగేళ్ల విరామం తర్వాత శ్రీదేవి ‘ఇంగ్లిష్ వింగ్లిష్’లో నటించారు.
ఈ చిత్రం విడుదలైన ఈ మూడేళ్లల్లో శ్రీదేవికి ఎన్నో అవకాశాలు వచ్చినా, చివరకు ఈ రాణీ సౌమ్యాదేవి పాత్రనే అంగీకరించారు. ఈ పాత్రలో శ్రీదేవి ఎలా ఉంటారో ఈ ఫస్ట్ లుక్‌లో చూడొచ్చు. నిజంగానే రాణీలా ఉన్నారు కదూ!
అతిలోక సుందరి రాణీ సౌమ్యాదేవి!
Published Mon, Jun 22 2015 10:57 PM | Last Updated on Sun, Sep 3 2017 4:11 AM
Advertisement
Advertisement