ప్రేమతో... | 'Yours Lovingly' new movie | Sakshi
Sakshi News home page

ప్రేమతో...

Published Thu, Jul 20 2017 11:29 PM | Last Updated on Tue, Sep 5 2017 4:29 PM

ప్రేమతో...

ప్రేమతో...

పృథ్వీ పొట్లూరి, సౌమ్య శెట్టి జంటగా తెరకెక్కిన సందేశ మిళిత వినోదాత్మక చిత్రం ‘యువర్స్‌ లవింగ్లీ‘. జో ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పృధ్వీ పొట్లూరి హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ నిర్మాత రాజ్‌ కందుకూరి విడుదల చేశారు. అనంతరం రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ– ‘‘మోషన్‌ పోస్టర్‌ చాలా ప్రామిసింగ్‌ గా ఉంది. ‘యువర్స్‌ లవింగ్లీ‘ టైటిల్‌లోనే చాలా పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ ఉన్నాయి. అందరూ కొత్తవాళ్లతో నిర్మించిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

‘‘మా చిత్రం విడుదలయ్యాక అందరూ దానిగురించే మాట్లాడుకుంటారు. పేరెంట్స్‌ తమ పిల్లల్ని వెంటబెట్టుకొని మరీ మా సినిమా చూస్తారు. ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న పృధ్వీకి మంచి భవిష్యత్‌ ఉంటుంది. త్వరలోనే  సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు జో. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్‌ కొడకండ్ల, కెమెరా: ప్రవీణ్‌ కండ్రేగుల.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement