‘మోదీ ఫొటోను చెప్పులతో కొట్టండి’ | abdulajalil Mustan Commented over modi | Sakshi
Sakshi News home page

‘మోదీ ఫొటోను చెప్పులతో కొట్టండి’

Published Wed, Mar 1 2017 2:26 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

abdulajalil Mustan Commented over modi

పట్నా: నోట్ల రద్దుకు నిరసనగా జరిగిన సభలో ప్రధాని మోదీని ఫొటోను చెప్పులతో కొట్టాలని బిహార్‌ ఎక్సైజ్‌ మంత్రి అబ్దులజలీల్‌ మస్తాన్   ప్రజలకు వివాదాస్పద విజ్ఞప్తి చేశారు. దీంతో కొందరు వేదికపై కుర్చీలోని మోదీ ఫొటోపై చెప్పులు విసిరారు.

ఈ నెల 22న మంత్రి నియోజకవర్గమైన పూర్ణియా జిల్లా అమోర్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు మంగళవారం స్థానిక చానళ్లలో ప్రసారం కావడంతో దుమారం రేగింది. నోట్ల రద్దుతో తలెత్తిన సమస్యలను 50 రోజుల్లో పరిష్కరిస్తానని, అలా చేయకపోతే శిక్ష ఎదుర్కొంటానని ప్రధానే స్వయంగా చెప్పారని మస్తాన్  అన్నట్లు వీడియోలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement