
జస్టిస్ అభిలాష కుమారితో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న మణిపూర్ గవర్నర్ నజ్మాహెప్తుల్లా
ఇంఫాల్(మణిపూర్) : మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అభిలాష కుమారి శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. మణిపూర్ గవర్నర్ నజ్మాహెప్తుల్లా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గుజరాత్ హైకోర్టు నుంచి జస్టిస్ కుమారికి మంగళవారం పదోన్నతి లభించింది. జస్టిస్ అభిలాష కుమారి హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కుమార్తె. ఢిల్లీ యూనివర్శిటీ పూర్వవిద్యార్థి అయిన జస్టిస్ కుమారి హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీలో లా పూర్తి చేశారు. 1984లో న్యాయవాద వృత్తిని స్వీకరించి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా చేసి, 2005లో గుజరాత్ హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు.
తండ్రి వీరభద్ర సింగ్‌తో జస్టిస్ అభిలాష కుమారి( ఫైల్ ఫోటో)
Comments
Please login to add a commentAdd a comment